అనంతపురం అగ్రికల్చర్ : యాంత్రీకరణ పథకంపై సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానిక రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్‌టీసీ) డీడీఏ డి.జయచంద్ర ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది రైతులను ఎంపిక చేశామన్నారు. తొలిరోజు ఎఫ్‌టీసీలో శిక్షణ ఉంటుందన్నారు. ఏడీఏ పి.రామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రెండోరోజు గార్లదిన్నెలో ఉన్న ట్రాక్టర్‌నగర్‌లో, మూడోరోజు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, నాలుగోరోజు రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రంతో పాటు పనిముట్లు తయారు కేంద్రాలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామని తెలిపారు. యాంత్రీకరణ పథకం, నియమ నిబంధనలు, వ్యవసాయ, ఉద్యాన పంటల్లో యంత్ర పరికరాల వాడకం, ఆవశ్యకత అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.