మీ బైక్ అర్ధాంతరంగా రోడ్డుపై ఆగిపోయిందా? ఆఫీస్‌కు వెళ్లే సమయంలో కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయా? టైర్ పంక్చరయ్యిందా? లేదా యాక్సిండెంట్ అయ్యిందా? బైక్ లేదా కారుని మార్గమధ్యలో విడిచిపెట్టలేక, మెకానిక్ వద్దకు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారా? ఇలా ఏ రిపేర్ అయినా సరే.. తమ మెకానిక్ వచ్చి రిపేర్ చేసి సమస్య పరిష్కరిస్తాడంటున్నారు సిటీకి చెందిన ముగ్గురు యువకులు. కేవలం ఒక్క క్లిక్ లేదా ఒక్క ఫోన్ కాల్‌తో మీరున్న చోటకే మెకానిక్ వచ్చి వాహనాన్ని రిపేర్ చేస్తారని భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం ‘గో గాడీ’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్‌లు.
సాక్షి, సిటీబ్యూరో:నెల్లూరుకు చెందిన ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్, సూర్యతేజలు నగరంలోని ఖాజాగూడలో స్థిరపడ్డారు. ప్రజిత్‌రెడ్డి కంప్యూటర్ సైన్స్, మిత్రవర్షిత్ ఆర్కిటెక్, సాయితేజ ఎంబీఏ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే వీళ్లు స్నేహితులు. ఓ రోజు సిటీ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు మార్గమధ్యలో మొరాయించింది. సంబంధిత సర్వీస్ సెంటర్‌కు కాల్ చేస్తే.. వాళ్లు సరిగా రెస్పాండ్ కాలేదు. చిరాకు వచ్చి కారు అక్కడే వదిలేసి వేరే వెహికల్‌లో విజయవాడ వెళ్లారు. ఈ సమస్య వీళ్ల ముగ్గురిదే కాదు. వీళ్ల బంధువులు, తెలిసిన వాళ్లకు కూడా ఎదురైంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏదైనా కొత్తగా ఆలోచించాలని ప్రయత్నించారు. ఆ ఆలోచనలో భాగంగానే ‘గో గాడీ’ యాప్‌నకు శ్రీకారం చుట్టారు.
యాప్ వినియోగమిలా..
మీ మొబైలోని ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ‘గో గా>డీ’ని సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరు, నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మార్గంమధ్యలో ఎక్కడైనా కారు లేదా బైక్ అగిపోతే ఈ యాప్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ‘కారు/బైక్ సర్వీస్, కార్/బైక్ స్పా, కార్/బైక్ యాక్ససిరిస్, రోడ్‌సైడ్ (గో గాడీ) అసిస్టెన్స్’ అనే ఆప్షన్స్ వస్తాయి. దీనిలో మనకున్న రిపేర్‌ని ఆ ఆప్షన్స్ ద్వారా ఎంచుకుని మనం ఉన్నచోటకు మెకానిక్‌కి పిలిపించుకోవచ్చు. ఇలా ఒక్క క్లిక్ చేసిన 20 నిమిషాల వ్యవధిలో మనం ఉన్న చోటకు మెకానిక్ వస్తాడు. యాప్‌ని వాడలేని వారు 79939 19293కు కాల్ చేసినా చాలు.
సిటీలో 500 సర్వీస్ సెంటర్లు
మనవద్దకు వచ్చిన మెకానిక్ వెహికల్ కండిషన్ చూస్తాడు. అది అక్కడిక్కడే రిపేర్ అయ్యేదైతే పరిష్కరిస్తారు. లేనిపక్షంలోæ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తారు. సిటీలో మొత్తం 500 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వెహికల్‌ని మనకు నచ్చిన సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్తారు, లేదా వాళ్లకు సంబంధించిన 500 సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి రిపేర్ చేస్తారు. మెకానిక్ వచ్చి అక్కడిక్కడ సమస్యను పరిష్కరిస్తే రూ.499 చార్జి చేస్తారు. అదే వెహికల్‌ని లిఫ్ట్ చేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే రూ.799. మెకానిక్ వచ్చేలోపు రిపేర్‌ని మనమే చేసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
మాకెదురైన సమస్య నుంచే..
కారు మొరాయిస్తే ఎంత చికాకు వస్తుందో.. మేం స్వయానా అనుభవించాం. అందుకే ముగ్గురం స్నేహితులం ఈ యాప్‌ని రూపొందించాం. సిటీతో పాటు విజయవాడ, నెల్లూరులలో కూడా ఈ సేవలను వాహనదారులకు అందిస్తున్నాం. యాప్ ద్వారా లేదా టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా మీ వెహికల్ రిపేర్ సమ స్యని పరిష్కరించుకోవచ్చు. త్వరలో ఈ చలా నా, ఫాస్టాగ్ రీచార్జి, కా రు అమ్మకాలు, కొను గోలు, డోర్‌స్టెప్ సేవలు వంటి వాటిని అందుబాటులోకి తేస్తాం.– సూర్యతేజ, ప్రజిత్‌రెడ్డి, మిత్రవర్షిత్
Comments
Please login to add a commentAdd a comment