ప్రాణం తీశారు | mechanic dies in chandra hospital | Sakshi
Sakshi News home page

ప్రాణం తీశారు

Published Thu, Nov 17 2016 12:12 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

ప్రాణం తీశారు - Sakshi

ప్రాణం తీశారు

u నిర్లక్ష్య వైద్యంతోనే లారీ మెకానిక్‌ మృతి చెందాడు
u చంద్ర హాస్పిటల్‌ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోâýæన
u డాక్టర్‌పై చర్యలు తీసుకుని, హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని డిమాండ్‌


అనంతపురం సెంట్రల్‌ : ఆపరేష¯ŒS సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాలు ఇన్ఫెక్ష¯ŒS అయ్యేలా చేసి నిండు ప్రాణాన్ని బలిగొన్నారని నందమూరి నగర్‌కు చెందిన లారీ మెకానిక్‌ సయ్యద్‌బాషా అలియాస్‌ చోటూ (32) బంధువు లు నగరంలోని చంద్ర హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శాంతిస్వరూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో బుధవారం ఆస్పత్రి ఎదుట ఆందోâýæన నిర్వహించారు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు.. పది రోజుల కిందట పెన్నహోబిలం సమీపంలో కారు బోల్తాపడిన ఘటనలో సయ్యద్‌బాషాకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్‌ శాంతిస్వరూప్‌ తను కన్సల్టెంట్‌గా ఉన్న చంద్రహాస్పిటల్‌కు రెఫర్‌ చేశారు. అక్కడ ఎన్టీఆర్‌ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) కింద ఆయన చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన నిమ్స్‌కు తీసుకెళితే.. కాలు ఇన్ఫెక్ష¯ŒS అయ్యి కుళ్లిపోయే స్థితికి చేరుకున్న విషయాన్ని గుర్తించచిన వైద్యులు అడ్మిష¯ŒS చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

కాలికి గాయమైన చోట అంటుకున్న మట్టిని కూడా తీయకుండా ఆపరేష¯ŒS చేసి కుట్లు వేయడంతో ఇన్ఫెక్ష¯ŒS సోకి ప్రాణం కోల్పోయాడని సయ్యద్‌బాషా బంధువులు మధ్యాహ్నం ఆస్పత్రి వద్దకు మృతదేహంతో చేరుకుని ఆందోâýæన నిర్వహించారు. మృతికి కారకుడైన డాక్టర్‌ శాంతిస్వరూప్‌పై చర్యలు తీసుకుని, చంద్ర హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

త్రీటౌ¯ŒS పోలీసులు రంగ ప్రవేశం చేసి హాస్పిటల్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో బాధితులు శాంతించారు. వీరి ఆందోâýæనకు ఎంఎండీఏ అధ్యక్షులు ఇమామ్, ఐఎంఎం అధ్యక్షులు బాషా, ఎంఐఎం నాయకులు అలీ, రఫీ, సీపీఎం నాయకులు ఇంతియాజ్, బాబావలి, సీపీఐ నాయకులు లింగమయ్య తదితరులు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గురువారం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. మృతుడికి భార్య భాను, కుమార్తెలు నాజు, యాస్మిన్, సాదియా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement