జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కాంక్రీట్ మిక్సర్ వాహనం మెకానిక్,
రోడ్డు ప్రమాదంలో మెకానిక్ దుర్మరణం
Published Fri, Feb 7 2014 2:06 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
భీమడోలు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కాంక్రీట్ మిక్సర్ వాహనం మెకానిక్, మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్‌యాదవ్(25) అనేవ్యక్తి మృతిచెందగా, వాహన డ్రైవర్ బి.కృష్ణానాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వస్తున్న ట్రాలీలారీ డ్రైవర్ మద్యం, నిద్రమత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ పైనుంచి తాడేపల్లిగూడెం వైపు రోడ్డుపైకి దూసుకుపోయింది.
అదే సమయంలో ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న సిమెంట్ లారీని ఢీకొని అనంతరం దాని వెనుక వస్తున్న సదరం ఇంజినీరింగ్ వర్క్స్‌కు చెందిన కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కాంక్రీట్ మిక్సర్ వాహనం బోల్తాపడగా క్యాబిన్ లో కూర్చున్న మెకానిక్ అనిల్‌యాదవ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. వాహన డ్రైవర్ క ర్నూలుకు చెందిన కృష్ణానాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రాలీలారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బోల్తాకొట్టిన కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని క్రేన్‌తో పక్కకు తీశారు. పోలీసులు ఎస్సై బి. సురే ందర్ కుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement