ఆర్టీసీ డిపోలో టెస్టింగ్ నిర్వహిస్తున్న ఓ మెకానిక్ ప్రమాదవశాత్తూ బస్సు ఢీకొని మృతి చెందాడు.
ప్రొద్దుటూరు: ఆర్టీసీ డిపోలో టెస్టింగ్ నిర్వహిస్తున్న ఓ మెకానిక్ ప్రమాదవశాత్తూ బస్సు ఢీకొని మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. జమ్మలమడుగుకు చెందిన పట్నం వెంకటరమణ(53) ఆర్టీసీ లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నైట్‌షిప్ట్ లో పనిచేస్తూ.. బస్సుకు ఆయిలింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో డిపోలోని మరో బస్సుకు టెస్ట్‌డ్రైవ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటరమణ మృతికి పలు కార్మికసంఘాలు తమ సంతాపం తెలిపాయి.