సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది.పెన్నా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన కుందూ పెన్నా సంగమం వద్ద చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకురాగా.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడు కమలాపురం వాసి జాఫర్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే పరామర్శ..
పెన్నా నదిలో కుందూ పెన్నా సంగమం వద్ద గల్లంతై మృతి చెందిన హుస్సేన్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ కమలాపురం ఎమ్మెల్యే పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు. హుస్సేన్ మృతదేహానికి నివాళులు అర్పించి అతని కుటుంబాన్ని ఓదార్చారు. గల్లంతైన మిగతా ముగ్గురు పిల్లల్ని బయటకు తెచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment