
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్ అనే వ్యక్తి సంజు(32) అనే మహిళను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా చిన్న అమ్మాయి గత సంత్సరం జన్మించింది. ఆ తర్వాత నుంచి సంజూను ఆమె భర్త వేధించేవాడు. అయితే గత కొంత కాలంగా సత్యపాల్ తన భార్య సంజును కట్నం కింద అదనంగా రూ.50 వేలు తీసుకురావాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు.
చదవండి: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం
అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్నాడు. ఈ ఘటనపై ఇరుకుటుంబాలు పలుమార్లు చర్చించినా నిందితుడు ఖాతరు చేయలేదు. దీనిపై బాధిత మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’’ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. కాగా నిందితుడు సత్యపాల్ ఆగష్టు 13న భార్య సంజూపై వేడి నీళ్లు పోసి పరారయ్యాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: Bullet Bandi Song: హుషారుగా డ్యాన్స్.. బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి.. వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment