2023కు జ్ఞాపకాలతో వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. నూతన సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసింది. అయితే 2023 రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దీనికితోడు 2023లో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. ఉదయ్‌పూర్ జీ-20ని స్వాగతించింది. రెండు భారీ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా ఉదయపూర్‌లో జరిగాయి.
ట్రావెల్ అండ్ లీజర్ 2023లో విడుదల చేసిన జాబితాలో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా పేరు తెచ్చుకుంది. పర్యాటకుల అభిరుచి, స్థానిక సంస్కృతి, ఆహారం, షాపింగ్, వివిధ పర్యాటక ప్రదేశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఉదయపూర్ నగరానికి 93.33 రీడర్ స్కోర్ లభించింది. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పర్యాటకులు ఉదయ్‌పూర్‌ను ఎంతగానో ఇష్టపడుతుంటారు.
భారత్ అధ్యక్షతన తొలి జీ-20 సమావేశం ఉదయపూర్‌లో జరిగింది. రెండవ జీ-20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ (ఎస్‌ఎఫ్‌డబ్ల్యుజీ) సమావేశం కూడా ఇక్కడే జరిగింది. దీనిలో 90 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి చెందింది. 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇక్కడే వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో నటాషాను వివాహం చేసుకున్నారు. స్టార్ హోటల్ రాఫాల్‌లో క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి హార్దిక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
Comments
Please login to add a commentAdd a comment