సానియా మీర్జాకు కేసీఆర్ అభినందనలు | Telangana state Chief Minister k.chandrasekhar rao congratulate Sania Mirza | Sakshi
Sakshi News home page

సానియా మీర్జాకు కేసీఆర్ అభినందనలు

Published Mon, Nov 2 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

Telangana state Chief Minister k.chandrasekhar rao congratulate Sania Mirza

సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిలకడగా అత్యున్నత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఒకే ఏడాదిలో పది టైటిల్స్ గెలవడం అసాధారణ విషయమని కొనియాడారు. భవిష్యత్‌లో సానియా మీర్జా మరిన్ని టైటిల్స్ నెగ్గి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement