womens doubles title
-
అశ్విని –తనీషా జోడీకి మహిళల డబుల్స్ టైటిల్
గువాహటి: ఆద్యంతం నిలకడగా రాణించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ –100 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం విజేతగా నిలిచింది. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అశ్విని –తనీషా జోడీ 21–13, 21–19తో సుంగ్ షువో యున్–యు చియెన్ హుయ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన అశ్విని–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అశ్విని –తనీషా ద్వయం అబుదాబి మాస్టర్స్, నాంటెస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీల్లోనూ టైటిల్స్ గెలిచింది. -
శ్రీజ ‘డబుల్’ ధమాకా
షిల్లాంగ్ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. గత ఏడాది సింగిల్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్‌గా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్లో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్ స్టార్ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది. బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్ ఐదుసార్లు జాతీయ సింగిల్స్ చాంపియన్‌గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొంది ంది. సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు చెందిన టకేమి సర్కార్–ప్రాప్తి సేన్ జోడీపై గెలిచింది. తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరా బాద్‌కు చెందిన మీర్ ఖాసిమ్ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్‌గా నిలిచారు. నా కల నిజమైంది... గతంలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జాతీయ టైటిల్స్ సాధించాను. కానీ సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. –‘సాక్షి’తో ఆకుల శ్రీజ -
చెక్ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్
Czech Top Seeds Win Womens Doubles Crown: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్ హద్దాద్ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. 2 గంటల 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెక్ జోడీకి కజకిస్థాన్ ద్వయం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ చెక్ జోడీ పట్టుదలగా ఆడి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో థనాసి కొకినాకిస్-నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్–పర్సెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. ఈ క్రమంలో ‘వైల్డ్ కార్డు’ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా చరిత్ర సృష్టించింది. చదవండి: కొకినాకిస్–కిరియోస్ జంటకు డబుల్స్ టైటిల్ -
క్రిచికోవా ‘డబుల్’ ధమాకా
పారిస్: ఐదో ప్రయత్నంలోనే తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి బర్బోర క్రిచికోవా 24 గంటలు గడవకముందే తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. శనివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన 25 ఏళ్ల క్రిచికోవా ఆదివారం మహిళల డబుల్స్ టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఫైనల్లో క్రిచికోవా –కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–4, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) –ఇగా స్వియాటెక్ (పోలాండ్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రిచికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో క్రిచికోవా ఏడో ర్యాంక్ నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకనుంది. ‘డబుల్’ విజయంతో క్రిచికోవా దిగ్గజ క్రీడాకారిణిల సరసన నిలిచింది. సెరెనా (2016 వింబుల్డన్‌లో) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణగా క్రిచికోవా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్ కింగ్ (1972), మార్గరెట్ కోర్ట్ (1973), క్రిస్ ఎవర్ట్ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్ (2000) ఈ ఘనత సాధించారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన చెక్ ప్లేయర్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా చరిత్ర సృష్టించింది. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిచికోవా.. ఇవాళ డబుల్స్ విజేతగా అవతరించింది. తన దేశానికే చెందిన కేథరీనా సినియాకోవాతో జత కట్టిన క్రిచికోవా.. ఫైనల్లో ఇగా స్వియాటెక్, బెతానీ మాటెక్ సాండ్స్ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది. దీంతో 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఏడాది సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఫీట్‌ను చివరిసారిగా 2000లో మేరీ పియర్స్ సాధించింది. కాగా, గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇలా సింగల్స్, డబుల్స్ టైటిళ్లను చివరిసారిగా సెరీనా విలియమ్స్ సాధించింది. సెరీనా 2016 వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించింది. ఇదిలా ఉంటే, శనివారం జరిగిన మహిళల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఓవరాల్‌గా క్రిచికోవా ఇప్పటివరకు కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించింది. చెక్ రిపబ్లిక్‌కే చెందిన సినియకోవాతో కలిసి 2018లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన క్రిచికోవా... 2018 వింబుల్డన్ ఓపెన్‌లోనూ మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించడంతో ఆమె గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. చదవండి: French Open: క్వీన్ క్రిచికోవా -
సానియా-హింగిస్ జంటకు షాక్
మూడో రౌండ్లో ఓడిన టాప్ సీడ్ జోడీ క్వార్టర్స్‌లో ముర్రే , వావ్రింకా పారిస్: వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని షాక్ ఎదురైంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్లలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీకి ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై... రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-6 (11/9), 6-4, 6-3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 6-7 (7/9), 6-3, 6-2తో ట్రయెస్కీ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్) 6-2, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై సంచలన విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-4తో స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)పై, షెల్బీ రోజర్స్ (అమెరికా) 6-3, 6-4తో ఇరీనా బేగూ (రుమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సానియా మీర్జాకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిలకడగా అత్యున్నత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఒకే ఏడాదిలో పది టైటిల్స్ గెలవడం అసాధారణ విషయమని కొనియాడారు. భవిష్యత్‌లో సానియా మీర్జా మరిన్ని టైటిల్స్ నెగ్గి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.