చెక్‌ జోడీ ఖాతాలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ | Barbora Krejcikova, Katerina Siniakova Win Australian Open 2022 Womens Doubles Title | Sakshi
Sakshi News home page

Australian Open 2022: చెక్‌ జోడీ ఖాతాలో డబుల్స్‌ టైటిల్‌

Published Sun, Jan 30 2022 4:41 PM | Last Updated on Sun, Jan 30 2022 4:43 PM

Barbora Krejcikova, Katerina Siniakova Win Australian Open 2022 Womens Doubles Title - Sakshi

Czech Top Seeds Win Womens Doubles Crown: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ టైటిల్‌ను టాప్‌ సీడ్‌ బార్బోరా క్రెజికోవా, కత్రీనా సినికోవా(చెక్‌ రిపబ్లిక్‌) జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అన్నా డానిలీనా, బేట్రిజ్‌ హద్దాద్‌ మయ్యాపై 6-7(3-7), 6-4, 6-4 తేడాతో విజయం సాధించి, కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ను ఎగురేసుకుపోయింది. 2 గంటల 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెక్‌ జోడీకి కజకిస్థాన్‌ ద్వయం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ చెక్‌ జోడీ పట్టుదలగా ఆడి విజేతగా నిలిచింది. 

ఇదిలా ఉంటే, నిన్న జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో థనాసి కొకినాకిస్‌-నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో ఎబ్డెన్‌–పర్సెల్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది. ఈ క్రమంలో ‘వైల్డ్‌ కార్డు’ ఎంట్రీ ద్వారా బరిలోకి దిగి డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన జోడీగా చరిత్ర సృష్టించింది. 
చదవండి: కొకినాకిస్‌–కిరియోస్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement