పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా చరిత్ర సృష్టించింది. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిచికోవా.. ఇవాళ డబుల్స్ విజేతగా అవతరించింది. తన దేశానికే చెందిన కేథరీనా సినియాకోవాతో జత కట్టిన క్రిచికోవా.. ఫైనల్లో ఇగా స్వియాటెక్, బెతానీ మాటెక్ సాండ్స్ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది. దీంతో 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఏడాది సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఫీట్‌ను చివరిసారిగా 2000లో మేరీ పియర్స్ సాధించింది. కాగా, గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇలా సింగల్స్, డబుల్స్ టైటిళ్లను చివరిసారిగా సెరీనా విలియమ్స్ సాధించింది. సెరీనా 2016 వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించింది.
ఇదిలా ఉంటే, శనివారం జరిగిన మహిళల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఓవరాల్‌గా క్రిచికోవా ఇప్పటివరకు కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించింది. చెక్ రిపబ్లిక్‌కే చెందిన సినియకోవాతో కలిసి 2018లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన క్రిచికోవా... 2018 వింబుల్డన్ ఓపెన్‌లోనూ మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించడంతో ఆమె గ్రాండ్‌స్లామ్ల సంఖ్య నాలుగుకు చేరింది.
చదవండి: French Open: క్వీన్ క్రిచికోవా
Comments
Please login to add a commentAdd a comment