Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబర్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్
కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్‌లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచింది.
ప్రైజ్‌మనీ ఎంతంటే
అంతకు ముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో వొండ్రుసోవా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ గెలిచింది. ఇక రన్నరప్ ప్లేయర్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది.
POV: you just become a Wimbledon champion 🏆#Wimbledon pic.twitter.com/kf484DhHUt
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Marketa's magical moment 🏆
Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies' singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Unseeded. Unstoppable.#Wimbledon pic.twitter.com/sgSwIWirDM
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Comments
Please login to add a commentAdd a comment