Marketa Vondrousova
-
వొండ్రుసోవాకు షాక్
లండన్: జెస్సికా బౌజస్ మనెరో వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో బౌజస్ పేరు మార్మోగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)కు తొలి రౌండ్లోనే షాకిచ్చి సంచలన విజయంతో వింబుల్డన్‌ను ఆరంభించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జెస్సికా బౌజస్ (స్పెయిన్) 6–4, 6–2తో ఆరో సీడ్ వొండ్రుసోవాను వరుస సెట్లలోనే ఇంటిదారి పట్టించింది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనలిస్టుగా నిలిచిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్... ఈ పరాభవంతో మూడు దశాబ్దాల తర్వాత వింబుల్డన్ గడ్డపై ఓ డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే ఓడిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. మహిళల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరైన స్టెఫీగ్రాఫ్ (జర్మనీ) 1994లో డిఫెండింగ్ చాంపియన్ హోదాతో వింబుల్డన్ బరిలోకి దిగి అనామక ప్లేయర్ లోరీ మెక్నీల్ (అమెరికా) చేతిలో ఓడింది. జొకోవిచ్ సులువుగా... పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ సూపర్‌స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ సులువుగా ముందంజ వేశాడు. జొకో 6–1, 6–2, 6–2తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై అలవోక విజయం సాధించాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–2తో కార్బలెస్ బేన (స్పెయిన్)పై గెలుపొందగా, రష్యన్ స్టార్, ఆరో సీడ్ రుబ్లెవ్ ఆట తొలి రౌండ్లోనే ముగిసింది. కామెసన (అర్జెంటీనా) 6–4, 5–7, 6–2, 7–6 (7/5)తో రుబ్లెవ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ నంబర్‌వన్, జానిక్ సినెర్ (ఇటలీ) 6–3, 6–4, 3–6, 6–3తో యానిక్ హఫ్‌మన్ (జర్మనీ)పై, ఏడో సీడ్ హుర్కాజ్ (పొలాండ్) 5–7, 6–4, 6–3, 6–4తో అల్బాట్ (మాల్దొవా)పై గెలుపొందారు. తొమ్మిదో సీడ్ డి మినౌర్ (ఆ్రస్టేలియా) 7–6 (7/1), 7–6 (7/3), 7–6 (7/4)తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై ప్రతి సెట్ కోసం ఓ యుద్ధమే చేసి గెలిచాడు. సూపర్ స్వియాటెక్ మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పొలాండ్) 6–3, 6–4తో అమెరికా చెందిన సోఫియా కెనిన్‌పై వరుస సెట్లలో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–3 6–1తో గాబ్రియెలా రూస్ (రుమేనియా)పై, ఐదో సీడ్ పెగులా (అమెరికా) 6–2, 6–0తో అష్లిన్ క్రూగెర్ (అమెరికా)పై, 15వ సీడ్ సామ్సోనొవా (రష్యా) 6–3, 4–6, 6–2తో రెబెకా మసరొవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) 6–1, 6–2తో టామ్జనోవిక్ (ఆ్రస్టేలియా)పై సులువైన విజయంతో శుభారంభం చేసింది. నగాల్ అవుట్ భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఆట వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో ముగిసింది. 72వ ర్యాంక్ భారత ప్లేయర్ 2–6 6–3, 3–6, 4–6తో ప్రపంచ 53వ ర్యాంకర్ కెక్మనొవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయం చవిచూశాడు. 26 ఏళ్ల నగాల్ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఏకంగా 44 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి ఆరు ఏస్‌లు సంధించి కేవలం రెండుసార్లు మాత్రమే డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
వింబుల్డన్‌కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్‌సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్‌లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్‌సీడెడ్‌గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాది రన్నరప్‌గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్‌గా ‘వీనస్ రోజ్‌వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్‌స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 6–4తో తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్‌లైన్ గేమ్‌తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్‌లో పదే పదే నెట్‌పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది. -
Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర
Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబర్‌ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచింది. ప్రైజ్‌మనీ ఎంతంటే అంతకు ముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో వొండ్రుసోవా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ గెలిచింది. ఇక రన్నరప్ ప్లేయర్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది. POV: you just become a Wimbledon champion 🏆#Wimbledon pic.twitter.com/kf484DhHUt — Wimbledon (@Wimbledon) July 15, 2023 Marketa's magical moment 🏆 Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies' singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn — Wimbledon (@Wimbledon) July 15, 2023 Unseeded. Unstoppable.#Wimbledon pic.twitter.com/sgSwIWirDM — Wimbledon (@Wimbledon) July 15, 2023