French Open tennis
-
French Open 2022: డబుల్స్ విజేత సాత్విక్–చిరాగ్ జోడీ
పారిస్: ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ ఖాతాలో మరో డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–19తో లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 49,950 డాలర్ల (రూ. 41 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. చదవండి: BWF Championships: ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన శంకర్ ముత్తుస్వామి -
సుమిత్ నగాల్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 2–6తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. -
సింధు శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్ జాకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సయాకా తకహాషి (జపాన్)తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్‌కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 17–21, 21–17, 11–21తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో... ప్రణయ్ 11–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్ 21–10, 21–16తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై, సౌరభ్ వర్మ 22–20, 21–19తో వైగోర్ కొహెలో (బ్రెజిల్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–19, 21–15తో మథియాస్ థైరి–మై సురో (డెన్మార్క్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో టాప్ సీడ్ లీ సోహీ–షిన్ సెయుంగ్‌చన్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్–యాంగ్ సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన చెక్ ప్లేయర్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా చరిత్ర సృష్టించింది. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రిచికోవా.. ఇవాళ డబుల్స్ విజేతగా అవతరించింది. తన దేశానికే చెందిన కేథరీనా సినియాకోవాతో జత కట్టిన క్రిచికోవా.. ఫైనల్లో ఇగా స్వియాటెక్, బెతానీ మాటెక్ సాండ్స్ జోడీపై 6-4, 6-2తో ఘన విజయం సాధించింది. దీంతో 2000 సంవత్సరం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఏడాది సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఫీట్‌ను చివరిసారిగా 2000లో మేరీ పియర్స్ సాధించింది. కాగా, గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇలా సింగల్స్, డబుల్స్ టైటిళ్లను చివరిసారిగా సెరీనా విలియమ్స్ సాధించింది. సెరీనా 2016 వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించింది. ఇదిలా ఉంటే, శనివారం జరిగిన మహిళల సింగల్స్ ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఓవరాల్‌గా క్రిచికోవా ఇప్పటివరకు కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించింది. చెక్ రిపబ్లిక్‌కే చెందిన సినియకోవాతో కలిసి 2018లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన క్రిచికోవా... 2018 వింబుల్డన్ ఓపెన్‌లోనూ మహిళల డబుల్స్ టైటిల్ సాధించింది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగల్స్, డబుల్స్ టైటిళ్లు సాధించడంతో ఆమె గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య నాలుగుకు చేరింది. చదవండి: French Open: క్వీన్ క్రిచికోవా -
గాయం బాధిస్తుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆడతానో తెలీదు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తన అభిమానులకు చేదు వార్త చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకున్న ఫెడెక్స్.. గత కొంతకాలంగా మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మూడో రౌండ్ విజయం అనంతరం మీడియా ముందు సూచన ప్రాయంగా వెల్లడించాడు. మోకాలి గాయం చాలా బాధిస్తుంది, దీంతో తాను ఎన్ని రోజులు కొనసాగుతానో తెలియడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మోకాలికి శస్ట్ర చికిత్స అనంతరం మూడు గంటల 35 నిమిషాల పాటు మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కోర్ట్‌పై వరుసగా మూడు విజయాలు సాధిస్తానని ఊహించలేదని ఆయన అన్నాడు. కాగా, మూడో రౌండ్లో భాగంగా శనివారం రాత్రి మూడున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫెదరర్.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ సీడ్ ఆటగాడు డొమినిక్ కోఫర్‌పై అద్భుత విజయం సాధించాడు. ఈ క్రమంలో అతను ఫ్రెంచ్ ఓపెన్‌లో 15వ సారి ప్రిక్వార్టర్స్ దశకు చేరాడు. కాగా, 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన 39 ఏళ్ల ఫెడెక్స్.. సోమవారం ఇటలీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్లో తలపడాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వింబుల్డన్ కోసమే ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 28 నుంచి వింబుల్డన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే వారం కూడా విశ్రాంతి దొరకదని, అందుకే అతను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కాగా, గతేడాది ఆరంభంలో ఫెదరర్ మోకాలికి రెండు సర్జరీలు జరిగాయి. దీంతో చాలా టోర్నీలకు అతను దూరంగా ఉన్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్ ఓపెన్ 2021లో అతను మళ్లీ బరిలోకి దిగాడు. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
నాదల్ నమోనమః
ఈసారీ ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. ఎర్రమట్టి కోర్టులపై మకుటం లేని మహరాజు తానేనని మరోమారు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ గుర్తు చేశాడు. 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్, నంబర్‌వన్ జొకోవిచ్‌ను చిత్తుగా ఓడించిన నాదల్ కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. పారిస్: సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్ ఓపెన్ మే–జూన్ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో నిర్వహించాల్సి వచ్చింది. తేదీలు మారినా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం విజేత మారలేదు. ఫైనల్లో తన అజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 2 గంటల 41 నిమిషాల్లో 6–0, 6–2, 7–5తో జొకోవిచ్‌ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా నాదల్ టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 8,50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► ఈ ఏడాది పూర్తిగా ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్కసారీ ఓటమి చవిచూడని (యూఎస్ ఓపెన్‌లో తన తప్పిదంతో మ్యాచ్‌ను వదులుకున్నాడు) జొకోవిచ్ ఫ్రెంచ్ ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. తొలి సెట్లో ఒక్కసారీ తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. జొకోవిచ్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌నూ మూడుసార్లు నిలబెట్టుకొని నాదల్ 48 నిమిషాల్లో తొలి సెట్‌ను 6–0తో సొంతం చేసుకున్నాడు. ► రెండో సెట్లోనూ పరిస్థితి మారలేదు. నాదల్ తన జోరు పెంచగా... జొకోవిచ్ సమాధానం ఇవ్వలేకపోయాడు. అతికష్టమ్మీద రెండు గేమ్‌లు గెల్చుకున్న సెర్బియా స్టార్ 51 నిమిషాల్లో రెండో సెట్నున కోల్పోయాడు. ► మూడో సెట్లో జొకోవిచ్ తేరుకున్నాడు. తొలి రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. కానీ ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 3–2తో ముందంజ వేశాడు. కానీ వెంటనే నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ వరుసగా రెండు గేముల్లో తమ సర్వీస్‌లను కాపాడుకున్నాడు. పదకొండో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్ సంధించి గేమ్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ సాధించిన విజయాలు. ఫెడరర్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 100 విజయాలు నమోదు చేసిన రెండో ప్లేయర్ నాదల్. ఫెడరర్ రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) వంద కంటే ఎక్కువ విజయాలు సాధించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య: 999 ఈ ఏడాది చాలా కఠినంగా ఉంది. 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఫెడరర్ రికార్డును సమం చేసినా... అది ఒక అంకె మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే ఫ్రెంచ్ ఓపెన్ నాకెప్పటికీ ప్రత్యేకమే. నా కెరీర్లో గొప్ప క్షణాలన్నీ ఇక్కడే వచ్చాయి. ఫ్రెంచ్ ఓపెన్‌తో, పారిస్ నగరంతో నా ప్రేమానుబంధం చిరస్మరణీయమైనది. –రాఫెల్ నాదల్ -
ఎర్రమట్టిలో టెన్నిస్ వీరులు
-
నాదల్ ‘నవ’ నాదం
-
నాదల్ ‘నవ’ నాదం
తొమ్మిదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం ఫైనల్లో జొకోవిచ్పై ఘన విజయం 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంప్రాస్ సరసన స్థానం అదే కోర్టు... అదే మట్టి...అతడే విజేత ఎరుపురంగు కనిపిస్తే స్పెయిన్ బుల్ రంకెలేస్తుంది... ఎర్ర మట్టి కనిపిస్తే ఈ స్పానిష్ స్టార్ ఆట పదునెక్కుతుంది. క్యాలెండర్లో సంవత్సరాల అంకెలు మారుతున్నాయి. కానీ ఆ గడ్డపై ఫలితం మాత్రం మారడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా ఆ జోరు ముందు తలవంచాల్సిందే. ఎంత మంది అక్కడ దండయాత్రకు వచ్చినా అది ఫైనల్ వరకే. నాదల్ ఫైనల్‌కు వచ్చాడంటే ప్రత్యర్థి రన్నరప్ ట్రోఫీని అందుకున్నామన్న అల్పానందంతో వెనుదిరగాల్సిందే. రోలండ్ గారోస్‌లోని క్లే కోర్టును తన సొంత అడ్డాగా మార్చుకున్న రాఫెల్ నాదల్ మరోసారి ఆ గడ్డపై తన దూకుడు ప్రదర్శించాడు. తనకు అచ్చొచ్చిన చోట వరుసగా ఐదో ఫ్రెంచ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రికార్డు విజయంతో చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మరోవైపు ప్రస్తుత ఫామ్‌తో అద్భుతాన్ని ఆశించిన ‘జోకర్’ నొవాక్ జొకోవిచ్‌కు మళ్లీ ‘ఫ్రెంచ్ ఓపెన్’ అందని ద్రాక్షే అయింది. పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. స్పెయిన్ స్టార్,ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ కింగ్‌గా నిలిచాడు. ఆదివారం రోలండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాదల్ 3-6, 7-5, 6-2, 6-4తో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై ఘన విజయం సాధించాడు. తొలి సెట్ నెగ్గి జొకోవిచ్ కాస్త ఆధిక్యం ప్రదర్శించినట్లు కనిపించినా... 3 గంటల 31 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చివరకు నాదల్‌దే పైచేయి అయింది. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ టైటిల్‌తో అతను అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ (అమెరికా)సరసన నాదల్ ఉన్నాడు. 17 టైటిల్స్‌తో ఈ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్) అగ్రస్థానంలో ఉన్నాడు. శుభారంభం మ్యాచ్ ఆరంభం నుంచి నాదల్, జొకోవిచ్ ఎక్కువగా బేస్‌లైన్ వద్దనుంచే పోటీ పడ్డారు. ఇందులో జొకోవిచ్ స్వల్ప ఆధిక్యం కనబర్చారు. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో జొకోవిచ్ 4-3తో ముందంజలో నిలిచాడు. అయితే ఈ దశలో తొలిసారి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని జొకోవిచ్ వృథా చేయలేదు. నాదల్ కొట్టిన రెండు ఫోర్‌హ్యాండ్ షాట్లు లైన్ బయట పడగా... జొకోవిచ్ తన పదునైన బ్యాక్‌హ్యాండ్ పాయింట్ సాధించి 5-3తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకున్న జొకోవిచ్ 44 నిమిషాల్లో సెట్‌ను ముగించాడు. కోలుకున్న నాదల్ రెండో సెట్లో మాత్రం వరల్డ్ నంబర్‌వన్ తనదైన దూకుడు ప్రదర్శించాడు. వరుసగా రెండు సార్లు బ్రేక్ పాయింట్లు సాధించి 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న జొకోవిచ్ 4-4తో, ఆ తర్వాత 5-5తో సమం చేశాడు. 17 విన్నర్లు సంధించిన స్పెయిన్ స్టార్ ఒత్తిడిని అధిగమించి 60 నిమిషాల్లో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అలవోకగా మూడో సెట్లో మాత్రం ఎర్ర మట్టి స్పెషలిస్ట్ చెలరేగిపోయాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నాదల్ 3-0తో ముందంజ వేశాడు. ఈ క్రమంలో వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయిన జొకోవిచ్ ఆ తర్వాత రెండుసార్లు తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నా లాభం లేకపోయింది. నాదల్ ఫోర్‌హ్యాండ్ షాట్ల ముందు సెర్బియా ఆటగాడు తేలిపోయాడు. ఫలితంగా 50 నిమిషాల్లో సెట్ గెలిచిన నాదల్కు మ్యాచ్‌లో ఆధిక్యం దక్కింది. అదే జోరు రికార్డు విజయం కోసం నాలుగో సెట్ బరిలోకి దిగిన స్పెయిన్ బుల్ అదే ఉత్సాహంతో ఆడాడు. తన మూడు గేమ్‌లను గెలుచుకోవడంతో పాటు మరో సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ దశలో అలసిపోయిన జొకోవిచ్ కోలుకోవడం కష్టమే అనిపించింది. అయితే నాదల్ పొరపాట్లతో ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన గేమ్‌ను కూడా నిలబెట్టుకొని 4-4తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడిన నాదల్ 5-4తో ముందంజ వేశాడు. చివరి గేమ్‌లో 30-30తో ఉన్న దశలో నాదల్ కొట్టిన క్రాస్ కోర్ట్ బ్యాక్ హ్యాండ్ విన్నర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సర్వీస్ చేస్తూ జొకోవిచ్ డబుల్ ఫాల్ట్ చేయడంతో ఎర్రమట్టి కోర్టుపై మరోసారి నాదల్ విజయ నాదం మోగింది. టెన్నిస్ చరిత్రలో వరుసగా పదో ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా నాదల్ చరిత్ర సృష్టించాడు. తొమ్మిదిసార్లు (2005 నుంచి 2008 వరకు; 2010 నుంచి 2014 వరకు) ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన నాదల్... 2008, 2010లలో వింబుల్డన్... 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్; 2010, 2013లలో యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించాడు.ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇప్పటివరకు జొకోవిచ్‌తో ఆడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. నాదల్ ఆడిన 9 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఒక్కటీ ఐదు సెట్లపాటు జరగకపోవడం విశేషం. మూడు ఫైనల్స్‌ను మూడు సెట్లలో... ఆరు ఫైనల్స్‌ను నాలుగు సెట్లలో ముగించాడు.విజేతగా నిలిచిన నాదల్కు 16 లక్షల 50 వేల యూరోలు (రూ. 13 కోట్ల 29 లక్షలు); రన్నరప్ జొకోవిచ్‌కు 8 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ‘‘ఇది అద్భుతమైన, ఉద్విగ్నభరితమైన విజయం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వెన్నునొప్పి కారణంగా కోల్పోయిన దానిని ఇక్కడ సాధించగలిగాను. రోలండ్ గారోస్‌లో ఆడటం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. జొకోవిచ్‌తో తలపడటం ఎప్పుడూ నాకు సవాలే. అతడు కూడా ఏదో ఒకరోజు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుస్తాడు.’’ - నాదల్ -
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ ఔట్!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అభిమానులను టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ నిరాశపరిచారు. ఫ్రెంచ్ ఓపెన్ లో పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు చేరకుండానే తిరుగుముఖం పట్టారు. 2004 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగిన మ్యాచ్ లో లాత్వియాకు చెందిన 18వ సీడ్ ఆటగాడు మెస్ట్స్ గుల్బీస్ చేతిలో ఓటమి పాలయ్యారు. గుల్బీస్ చేతిలో 7-6(5), 6-7(3), 2-6, 6-4, 3-6 స్కోరు తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యారు. ఓ దశలో ఫెదరర్ రెండవ సెట్ లో 5-3తో ఆధిక్యం కనబరిచినా.. సెట్ ను సొంత చేసుకోలేకపోయాడు.