![French Open: Satwiksairaj Rankireddy and Chirag Shetty clinch mens doubles - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/31/french-open.jpg.webp?itok=rvlDTB5g)
పారిస్: ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ ఖాతాలో మరో డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–19తో లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 49,950 డాలర్ల (రూ. 41 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.
చదవండి: BWF Championships: ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన శంకర్ ముత్తుస్వామి
Comments
Please login to add a commentAdd a comment