ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ ఔట్!
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి రోజర్ ఫెదరర్ ఔట్!
Published Sun, Jun 1 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అభిమానులను టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ నిరాశపరిచారు. ఫ్రెంచ్ ఓపెన్ లో పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు చేరకుండానే తిరుగుముఖం పట్టారు.
2004 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగిన మ్యాచ్ లో లాత్వియాకు చెందిన 18వ సీడ్ ఆటగాడు మెస్ట్స్ గుల్బీస్ చేతిలో ఓటమి పాలయ్యారు.
గుల్బీస్ చేతిలో 7-6(5), 6-7(3), 2-6, 6-4, 3-6 స్కోరు తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యారు. ఓ దశలో ఫెదరర్ రెండవ సెట్ లో 5-3తో ఆధిక్యం కనబరిచినా.. సెట్ ను సొంత చేసుకోలేకపోయాడు.
Advertisement
Advertisement