
గువాహటి: ఆద్యంతం నిలకడగా రాణించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ –100 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం విజేతగా నిలిచింది.
40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అశ్విని –తనీషా జోడీ 21–13, 21–19తో సుంగ్ షువో యున్–యు చియెన్ హుయ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన అశ్విని–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అశ్విని –తనీషా ద్వయం అబుదాబి మాస్టర్స్, నాంటెస్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీల్లోనూ టైటిల్స్ గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment