ట్రంప్కు ఒబామా ఫోన్.. కలుసుకోవాలని ఆహ్వానం | Obama calls Trump; invites the President-elect to White House | Sakshi
Sakshi News home page

ట్రంప్కు ఒబామా ఫోన్.. కలుసుకోవాలని ఆహ్వానం

Published Wed, Nov 9 2016 6:59 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్కు ఒబామా ఫోన్.. కలుసుకోవాలని ఆహ్వానం - Sakshi

ట్రంప్కు ఒబామా ఫోన్.. కలుసుకోవాలని ఆహ్వానం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అభినందనలు తెలియజేశారు. బుధవారం ట్రంప్కు ఫోన్ చేసిన ఒబామా శుభాకాంక్షలు చెప్పడంతోపాటు గురువారం శ్వేత సౌదానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడ వారిద్దరు అధికార బదిలీకి సంబంధించిన అంశాలు చర్చించుకోనున్నారు. ఫలితాలు వెల్లడైన మరుక్షణమే ఒబామా స్వయంగా తన ఇంటి నుంచి ట్రంప్కు ఫోన్ చేశారని, వైట్ హౌస్ కు ఆహ్వానించారని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ కెల్యాన్నే కాన్వే కూడా స్పష్టం చేశారు. న్యూయార్క్లోని తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒబామా ఫోన్ చేశారని తెలిపారు. అయితే, ప్రసంగం అయిపోగానే ట్రంప్ ఆయనకు తిరిగి ఫోన్ చేశాడని, వారిద్దరి మధ్య చాలా చక్కటి సంభాషణ సాగిందని అన్నారు. వారిద్దరు రేపు కలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ఎన్నికల ఫలితాలు, రాబోయే రోజుల్లో ఒకరికొకరు కలిసి పనిచేసే విషయంలో ఒబామా ఒక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement