అభినందించటానికి మీరెంత దూరం?
సెల్ఫ్ చెక్
ఆటల్లో గెలిచినవారు, చదువులో ర్యాంకులు సాధించినవారు, సమాజం కోసం కష్టపడి పనిచేసేవారు... ఎవరైనా ఒక మంచిపని చేసినా లేదా ఏదైనా సాధించినా కోరుకొనేది చిన్నపాటి అభినందన. ఇది లభించినప్పుడు వారు పడిన శ్రమనంతా మరచిపోతారు. అభినందించే తత్వం ఉండాలంటే ప్రేమ ఉండాలి. అసూయద్వేషాలకు దూరంగా ఉండాలి. ఇతరులను అభినందించాలంటే మీ అహం మీకు అడ్డుగా ఉందేమో ఒకసారి పరిశీలించుకోండి.
1. ఎవరైనా మంచిపని చేసినప్పుడు తప్పకుండా అభినందిస్తారు.
ఎ. కాదు బి. అవును
2. మీ అభినందనలు ఎవరికైనా తెలియచే యలేకపోతే, అంతటితో వదిలేయరు. ఎంతకాలం గడిచినా ఎప్పటికైనా వారితో మీ మనసులోని మాటను చెబుతారు.
ఎ. కాదు బి. అవును
3. మనిషి కోర్కెలకు అంతం ఉండదని మీకు తెలుసు. మీ కోర్కెలను అదుపులో పెట్టుకుంటారు. ఇతరులనుంచి ఏదీ ఆశించరు.
ఎ. కాదు బి. అవును
4. ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేరు. వారు అలా ఎందుకు అభివృద్ధి చెందాలి? అని ఆలోచిస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
5. ఆనందం విలువ మీకు తెలుసు. అందుకే ఇతరులు ఏదైనా సాధించినప్పుడు మీ అభినందనల ద్వారా వారికీ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
6. మీకు లభించే ప్రతివస్తువు (విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లికేషన్స్, ప్రకృతి ద్వారా లభించేవి మొదలైనవి)ను గౌరవిస్తారు. వాటిద్వారా లభించే సౌకర్యాలను అప్రిషియేట్ చేస్తారు.
ఎ. కాదు బి. అవును
7. మీరు సాధించలేని వాటి కారణాలను విశ్లేషిస్తారేకాని, వాటిగురించి ఆందోళన చెందరు. మీరు సాధించిన దానికి మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు.
ఎ. కాదు బి. అవును
8. మీ దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎదుటివారి స్కిల్స్‌ను బయటపెట్టడానికి ట్రై చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు.
ఎ. కాదు బి. అవును
9. ఇతరుల తప్పొప్పులను ఎంచటమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటివారు ఎంత గొప్పపని చేసినా అది మీ దృష్టిలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇతరుల మనసు గాయపరచటం మీకలవాటు.
ఎ. అవును బి. కాదు
10. ఆత్మతృప్తి మీకుంటుంది. గడచిన జీవితం ఆనందంగానే సాగిందని నమ్ముతారు. మీకు సహాయంగా నిలిచిన అందరికీ మనసులో కృతజ్ఞతలు తెలుపుతారు.
ఎ. కాదు బి. అవును
‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో అభినందించే తత్వం బాగా ఉంటుంది. స్వార్థంతో ఉండకుండా ఏదైనా సాధించిన వారిని అప్రిషియేట్ చేయగలరు. దీనివల్ల నలుగురితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు సంతృప్తి మిగులుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే ఇతరులను అభినందించాలంటే మీకసలు నచ్చదు. అందరినీ అభినందించటం తెలుసుకోండి. చిన్న ప్రశంస గొప్ప ఆనందాన్నిస్తుంది.