హర్మన్‌ ప్రీత్‌ పై ప్రశంసల జల్లు.. | Harmanpreet Kaur Smashes Unbeaten 171, Virat Kohli And Others Congratulate Her | Sakshi
Sakshi News home page

హర్మన్‌ ప్రీత్‌ పై ప్రశంసల జల్లు..

Published Fri, Jul 21 2017 9:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

హర్మన్‌ ప్రీత్‌ పై ప్రశంసల జల్లు..

హర్మన్‌ ప్రీత్‌ పై ప్రశంసల జల్లు..

హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్‌ ప్రీత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 20 ఫోర్లు 7 సిక్సులతో 171 నాటౌట్‌గా కెరీర్‌లో కౌర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. సింగిల్‌ హ్యాండ్‌ ప్రదర్శనపై భారత క్రికెటర్లు, అభిమానులు ఈ వైస్‌ కెప్టెన్‌ను సోషల్‌ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 
భారత కెప్టెన్‌ కోహ్లీ ‘వాట్‌ ఏ ఇన్నింగ్స్‌ కౌర్‌.. బౌలర్ల ప్రదర్శన అద్భుతమని’ ట్వీట్‌ చేయగా.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అద్బుతమైన బ్యాటింగ్‌ కౌర్‌.. విజయం దిశగా పయనించండి అని ట్వీట్‌ చేశాడు. సింగిల్‌ హ్యాండ్‌తో గెలిపించే మ్యాచ్‌లు చూసి చాల రోజులైందని సంజయ మంజ్రేకర్‌ కౌర్‌ ప్రదర్శనను కొనియాడాడు. ఇక ట్వీటర్‌ వీరుడు.. సెహ్వాగ్‌ కౌర్‌ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌.. అద్భుతమైన హిట్టింగ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. కౌర్‌ రాక్‌ స్టార్‌ అని భారత్‌ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రీ.. ప్రశంసించగా.. మహిళల ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ అని కైఫ్‌ కౌర్‌ను కొనియాడాడు.
 
 
భారత క్రికెటర్లు జస్ప్రీత్‌ బుమ్రా, సురైశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌లు కౌర్‌ను మిథాలీసేనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అభిమానులు కౌర్‌కు, భారత మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ తమ అభిమానాని చాటుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్‌లో భారత మహిళలు విజయం సాధించి ప్రపంచ కప్‌ సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్‌ ఉమెన్‌గా దీప్తిశర్మ(188 నాటౌట్‌) తర్వాత కౌర్‌ నిలిచింది. దీప్తీ దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించింది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement