విజయానంతరం భారత ఆటగాళ్ల సంబరాలు
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువభారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ గర్వించదగ్గ సమయమిదని రాజకీయ ప్రముఖుల, క్రికెటర్లు,సినీతారాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. కుర్రాళ్ల విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
యువ క్రికెటర్లు సాధించిన ఈ అద్భుత విజయానికి ఎంతో థ్రిల్లయ్యాను. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు అభినందనలు. ఈ గెలుపుతో ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాడు- ప్రధాని నరేంద్ర మోదీ
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత్‌కు అభినందనులు. ఈ తరం క్రికెటర్లు అందించిన ఈ విజయంతో దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీలవుతున్నారు- రాహుల్ గాంధీ
కోచ్ ద్రవిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన అండర్-19 భారత జట్టుకు అభినందనలు.- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అండర్-19 ప్రపంచకప్ విజేతగా నాలుగోసారి నిలిచిన భారత్‌కు అభినందనలు. ఈ క్రెడిట్ అంతా కుర్రాళ్లతో పాటు నా ఆల్‌టైం ఫేవరెట్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌దే- కేటీఆర్
గొప్ప టీమ్ వర్క్‌తో మీ కలను సాకారం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లకు కంగ్రాట్స్. మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. రాహుల్ ద్రవిడ్‌కు అభినందనలు- సచిన్ టెండూల్కర్
ఈ కుర్రాళ్లు రాహుల్ ద్రవిడ్ సురక్షితమైన చేతుల్లో పడ్డారు. భారత క్రికెట్ భవిష్యత్ కోసం గొప్ప కృషి. మనమంతా గొప్ప నైపుణ్యమున్న భవిష్యత్ ఆటగాళ్లను కలిగిఉన్నాం- వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ గెలిచిన యువ భారత ఆటగాళ్లకు అభినందనలు. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చారు- అనిల్ కుంబ్లే
అద్భుత ప్రదర్శనతో మన దేశానికి మరో ఘనతను అందజేశారు. ఈ క్షణాలను బాగా ఆస్వాదించండి- రవిశాస్త్రి
అండర్-19 జట్టుకు మరో అద్భుత విజయం. దీన్ని పునాదిగా చేసుకుని భవిష్యత్తులో రాణించండి. ఈ మూమెంట్‌ను బాగా ఆస్వాదించండి- విరాట్ కోహ్లీ
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కంగ్రాట్స్. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సమిష్టిగా రాణించి విజయం సాధించింది- యువరాజ్ సింగ్
ప్రపంచకప్ గెలిచిన అండర్ 19 జట్టుకు శుభాకాంక్షలు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారు - టాలీవుడ్ హీరో వెంకటేశ్
యావత్తు భారత దేశం గర్వించదగ్గ సమయమిది. భారత అండర్-19 జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. యంగ్ హీరోస్‌కు నా కంగ్రాట్స్- మహేశ్ బాబు
నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కంగ్రాట్స్. సీనియర్, జూనియర్ జట్లు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాయి- ఎస్.ఎస్.రాజమౌళి
Comments
Please login to add a commentAdd a comment