ప్రపంచకప్‌ విజేతలకు ఘన స్వాగతం | India U-19 World Cup winning team returns to grand reception | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 7:14 PM | Last Updated on Tue, Feb 6 2018 10:21 AM

India U-19 World Cup winning team returns to grand reception - Sakshi

బస్సులో బయలు దేరుతున్న యువ క్రికెటర్లు

సాక్షి, ముంబై : న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో అదరగొట్టి ట్రోఫీని సొంత చేసుకున్న భారత కుర్రాళ్లు సోమవారం స్వదేశానికి చేరారు. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పృ‍థ్వీషా నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు నాలుగోటైటిల్‌ అందించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు  స్వాగతం పలికేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సమిష్టి కృషి వల్లే ప్రపంచకప్‌ సాధించామన్నారు. అందరూ బాగా రాణించడంతో మా కష్టానికి ఫలితం దక్కిందని, యువ క్రికెటర్లకు మంచి భవిష్యత్‌ ఉందని కితాబిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement