
ట్వీటర్‌లో పోటెత్తిన శుభాకాంక్షలు
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకి ట్వీటర్‌లో శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడుకి ట్వీటర్‌లో శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. చాలా ఏళ్లుగా వెంకయ్యనాయుడు తనకు తెలుసని, ఆయన ఉప రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీటర్‌లో పోస్టు చేశారు.
వెంకయ్య అనుభవం క్రీయాశీలకం కానుందని అన్నారు. పాతికేళ్ల రాజకీయ అనుభవానికి పట్టమిదీ అని రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్వీట్ చేశారు. రైతు బిడ్డకు దక్కిన గౌరవమిది అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెంకయ్యను అభినందిస్తూ ట్వీటారు. వెంకయ్యకున్న నాయకత్వ లక్షణాలే ఆయన్ను ఉప రాష్ట్రపతి లాంటి ఉన్నత పదవికి దగ్గర చేశాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.