షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా | Kareena Kapoor congratulates Shahid Kapoor on the birth of his baby girl | Sakshi

షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా

Aug 30 2016 4:13 PM | Updated on Sep 4 2017 11:35 AM

షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా

షాహిద్ కు మెసేజ్ చేసిన కరీనా

బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మీరా రాజ్పుత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చింది.

బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అతని భార్య మీరా రాజ్పుత్ శుక్రవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. బుజ్జాయి రాకతో షాహిద్ సంతోషంలో మునిగిపోయాడు. తొలిసారి తల్లిదండ్రులైన షాహిద్ దంపతులకు.. సన్నిహితులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా బాలీవుడ్ బ్యూటీ, ఒకప్పటి షాహిద్ గాళ్ ఫ్రెండ్  కరీనా కపూర్ కూడా వీరికి శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. షాహిద్ తండ్రయ్యారన్న విషయం  తెలిసిన వెంటనే షాహిద్కు అభినందనలు తెలుపుతూ కరీనా మెసేజ్ పంపించారట. ఒకప్పటి విఫల ప్రేమికులు.. వివాహానంతరం స్నేహితులుగా మారారు.

కాగా మరికొన్ని నెలలలో కరీనా కూడా తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరో, కరీనా భర్త అయిన సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్లు 'రంగూన్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement