ఉస్మానియా వర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జర్నలిజం అధ్యాపకుడు ప్రొఫెసర్ బాలస్వామి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం గుంటూరు జిల్లా అమరావతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంఏ కమ్యూనికేషన్స్ పూర్తిచేశారు. అనంతరం అస్సాంలోని తేజ్‌పూర్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదేళ్లు పనిచేశారు. జర్నలిజంలో పీహెచ్‌డీ చేసిన తొలి దళిత అధ్యాపకుడిగా పేరున్న బాలస్వామి.. 2004లో ఓయూలో ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment