20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్‌  | Seminar Starts From 20th March On Physical Education | Sakshi
Sakshi News home page

20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్‌ 

Published Fri, Mar 13 2020 2:14 PM | Last Updated on Fri, Mar 13 2020 2:17 PM

Seminar Starts From 20th March On Physical Education  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి అంతర్జాతీయ సెమినార్‌ జరుగనుంది. ‘వ్యాయామ విద్య, స్పోర్ట్స్‌ సైన్స్‌’లలో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 600 మంది క్రీడాధికారులు ఇందులో పాల్గొననున్నారు.

వీరితో పాటు వ్యాయామ విద్య ప్రొఫెసర్లు, స్పోర్ట్స్‌ సైంటిస్టులు, కోచ్‌లు, ట్రెయినర్లు, స్పోర్ట్స్‌ డాక్టర్లు, వ్యాయామ విద్య స్కాలర్లు, టీచర్లు ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగరాజు, నిజాం కాలేజి ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ కుమార్, జూనియర్‌ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ బి. లక్ష్మయ్య , విశాల్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు .  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement