కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ వివేక్
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు.
ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్‌లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment