ఉస్మానియా యూనివర్సిటీ: ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న 317 జీవోను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317తో ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానికతను, రోస్టర్‌ను పట్టించుకోకుండా అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారన్నారు.
సీనియర్‌ను జూనియర్‌గా మారుస్తూ సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు అన్యాయంగా బదిలీ చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తే లోకల్ సమస్యతో పాటు వారి పిల్లలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అగౌరవపరచకుండా వారికి న్యాయం జరిగేలా ఉన్న జీవోపై కేసీఆర్ క్షుణంగా అధ్యయనం చేయాలని, బదిలీలపై గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment