Lingam
-
‘317 జీవోను రద్దు చేయండి’
ఉస్మానియా యూనివర్సిటీ: ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న 317 జీవోను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317తో ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానికతను, రోస్టర్‌ను పట్టించుకోకుండా అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారన్నారు. సీనియర్‌ను జూనియర్‌గా మారుస్తూ సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు అన్యాయంగా బదిలీ చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తే లోకల్ సమస్యతో పాటు వారి పిల్లలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అగౌరవపరచకుండా వారికి న్యాయం జరిగేలా ఉన్న జీవోపై కేసీఆర్ క్షుణంగా అధ్యయనం చేయాలని, బదిలీలపై గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. -
మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేంతవరకు ఎక్కడికక్కడ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వయోభారంతో మానసికంగా నిరుద్యోగులు కుంగిపోతున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా డీఎస్సీ లేదని, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులను నిరుద్యోగులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని లింగంగౌడ్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు. -
కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షురకులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నెలన్నర రోజులుగా క్షౌరశాలలను మూసివేయడంతో వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. క్షౌర వృత్తిదారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు రూ. 5 వేలు చొప్పున సహాయం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న రెడ్జోన్లలో 35 వేలకు పైగా క్షౌరశాలలు ఇప్పటికీ మూతపడివున్నాయని వెల్లడించారు. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి క్షౌర వృత్తిదారులకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవస్థానాల్లోని కల్యాణ్ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. -
న్యాయవాదులను ఆదుకోండి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అడ్వకేట్ మద్దికుంట లింగం నారాయణ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో జూనియర్ లాయర్లు, నిరుపేద న్యాయవాదులు ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేరుగొప్ప ఊరు దిబ్బ చందంగా న్యాయవృత్తిలో కొనసాగుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వెల్లడించారు. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా కోర్టులు మూతపడటంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై ఎంతో న్యాయవాదులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యాయవాదులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసిందని, జూనియర్ న్యాయవాదులకు రూ. 5 వేలు చొప్పున సహాయం అందించడానికి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా న్యాయవాదులను ఆదుకోవడానికి రూ.10 వేలు చొప్పున తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించి న్యాయవాదులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని లింగం నారాయణ కోరారు. -
పంచాయతీ ఎన్నికల్లో వర్గీకరణ పాటించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి కేటాయించే రిజర్వేషన్లను ఏబీసీడీ గ్రూప్‌లుగా కేటాయించాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీసీ సంఘాలు, ఎంబీసీ సంఘాల నాయకులు చేపట్టిన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో అమల్లు చేస్తున్నట్టుగానే ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు కేటగిరివారీగా అమలుచేయాలన్నారు. ఏబీసీడీలు గ్రూపులుగా రిజర్వేషన్లు కేటాయించినపుడే నాయీ బ్రాహ్మణులు, రజకులు, తదితర అట్టడుగు స్ధాయిలో ఉన్న వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. మైనారిటీ బీసీ కులాలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాజిక న్యాయసూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంబీసీ కులాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణ వృత్తిని తమవారు తప్ప ఇతర కుల, మతస్తులు చేపట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నాయీ బ్రాహ్మణులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మహేష్ చంద్ర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తేలుకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు జులుంపై ‘నాయీ’ల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తమ కులస్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులుం పదర్శించడాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. మొదటి నుంచి తమ పట్ల చంద్రబాబు వివక్ష చూపుతున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షుడు ఎం. లింగం ఆరోపించారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెల్పుతున్నామని ప్రకటించారు. తమ వారికి సంఘీబావంగా అవసరమైతే తెలంగాణలోనూ కళ్యాణ కట్టలను బంద్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
అన్ని ఆలయాల్లో క్షురకుల ధర్నాలు
-
‘తలనీలాలు’ బంద్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం ఆందోళనకు దిగారు. తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ‘కత్తి డౌన్’ నిరసన చేపట్టారు. దేవాలయాల్లో కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీసవేతనం రూ.15 వేలు ఇచ్చి తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడ దుర్గగుడిలో కురక్షుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న క్షురకులు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు విధులను బహిష్కరించారు. సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, ప్రెనుగంచిప్రాలు తదితర ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంతో కేశఖండనశాలలు బోసిబోయాయి. తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వెనుదిరిగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. రేపటి నుంచి తిరుమలలోనూ కేశఖండన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో నాయీ బ్రాహ్మణుల ఆందోళన తెలంగాణ ఐక్య వేదిక మద్దతు ఆంధ్రప్రదేశ్‌లో క్షురకుల ఆందోళనకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మద్దతు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్ చేయాలని ఐక్యవేదిక అధ్యక్షుడు యం. లింగం నాయీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బడ్జెట్ కేటాయింపులపై హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో తమ సామాజిక వర్గానికి తగినన్ని కేటాయింపులు జరపడం పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నివర్గాలకు సముచితంగా నిధులు కేటాయించారని ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందనడానికి ఈ బడ్జెట్ నిదర్శమని ప్రశంసించారు. నాయీబ్రాహ్మణుల సాధికారతకు తగినన్ని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. తమకు కేటాయించిన నిధులను తగినవిధంగా ఖర్చుచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారైనా నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని, తమ జనాభాను దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బీసీల్లో తమ కులం బాగా వెనుకబడి ఉందని.. తమను చట్టసభకు పంపించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైస్థాయికి తీసుకురావాలని కోరింది. ఈ మేరకు నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు అన్నిరకాలుగా వెనుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమ కులానికి చెందిన వారెవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కాలేదని వెల్లడించారు. ఇతర వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించినట్టుగానే తమకు కూడా అవకాశం ఇవ్వాలని మఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు విజ్ఞప్తి చేశారు. నాయీబ్రాహ్మణులను శాసనమండలి, రాజ్యసభకు నామినేట్ చేసి న్యాయం చేయాలని లింగం నాయీ కోరారు. రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. -
వీరభద్రుడికి సర్ప రక్షణ?
చండ్రుగొండ: చంద్రముఖి వంటి సిని మాల్లో నిధికి లేదా ఏదైనా పురాతన వస్తువులకు పాము కాపలాగా ఉండటం అది వెంటపడటం వంటివి చాలా చూశాం. కానీ అదే నిజ జీవితంలోనూ జరిగితే.. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో అలాంటి ఘటనే జరిగిందని స్థాని కులు చెబుతున్నారు. వీరభద్రుడి పురాతన విగ్రహాలను తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పాము వెంటాడిందని అంటున్నారు. ఈ సంఘటన వివరాలు ఆల స్యంగా వెలుగులోకి వచ్చాయి. దామరచర్ల గ్రామానికి చెందిన భూస్వామి సోమరాజు లక్ష్మీ వెంకట నర్సింహారావు (రాజా) తన వ్యవసాయ క్షేత్రంలో ఖాళీగా ఉన్న కొంత భూమిని ఇటీవల లెవెలింగ్ ట్రాక్టర్‌తో చదును చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయుధం కలిగిన వీరభద్రుడి విగ్రహంతోపాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం, చిన్న శివలింగం పానిపట్టం లభిం చాయి. దీంతో ఆయన విషయాన్ని అధికారులకు చేరవేశారు. పురాతన విగ్రహాల విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఈ క్రమంలో కొత్తగూడెం ఆర్డీవో ఎంవీ. రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కనకదుర్గ సిబ్బందితో కలసి బుధవారం దామరచర్ల శివారులోని సంఘటన స్థలానికి వెళ్లారు. పురాతన విగ్రహాలను తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో సిబ్బంది విగ్రహాలను తీసుకుని బయల్దేరగా.. అకస్మాత్తుగా ఓ పాము ప్రత్యక్షమైనట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. అది తహసీల్దార్ కనకదుర్గ వెంటపడగా.. అక్కడున్న వారు పాము.. పాము అంటూ కేకలు వేయడంతో ఆమె ఒక్కసారిగా పరుగులు పెట్టారు. కొంతదూరం తరువాత పాము కనిపించకుండా పోయినట్లు రెవెన్యూ సిబ్బందితోపాటు భూస్వామి రాజా చెబుతున్నాడు. ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న అధికారులు ఆ విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తెచ్చారు. భయం భయంగా.. పురాతన విగ్రహాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన అధికారులు, సిబ్బంది కొన్ని గంటలపాటు భయం భయంగా గడిపారు. జరిగిన సంఘటనపై ఆందోళన చెందిన తహసీల్దార్ కనకదుర్గ ఈ విషయాన్ని ఆర్డీవోకు వివరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు పురాతన విగ్రహాలను మళ్లీ యథాస్థానానికి తరలించారు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. తాను పరుగులు పెట్టిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను పామును చూడలేదన్నారు. -
ఉజైనీ
ఉజ్జయిని దక్షిణాభిముఖుడికి జై భూగర్భంలో కొలువుదీరిన పరమేశ్వరుడు భస్మహారతితో సంతుష్టుడయ్యే భవుడు జన్మజన్మల పాపాలను హరించే లోకనాయకుడు ఉజ్జయిని నగరాధీశుడు... మహాకాళేశ్వరుడు. ఉజ్జయిని నగరానికి చరిత్రలో ‘అవంతి’ అని పేరుండగా, చరిత్రకు పూర్వమే ఉన్న నగరంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జాన్ అంటే ఉద్యానవనం. నేటికీ ఈ నగరం సుందర ప్రకృతి రామణీయకతకు మారుపేరుగా నిలుస్తోంది. ఆనాటి లెక్కల ప్రకారం ముఖ్య కాలమాన రేఖాంశం ఉజ్జయిని మీదుగా ఉండేది. అక్కడ వెలసిన మహాకాలుడే కాలానికి అధిపతిగా పూజలందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వదైన శివలింగం మహాకాళేశ్వరుడు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి - ఇద్దరూ కొలువున్న క్షేత్రం ఉజ్జయిని. ఈ పన్నెండు క్షేత్రాల్లోనూ శంకరుడు దక్షిణాభిముఖుడిగా కొలువై ఉన్న తీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ ఈ ప్రత్యేకత లేదు. దక్షిణాభిముఖంగా స్వయంభువై వెలసిన మహాకాళేశ్వర ఆరాధనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ లింగానికి ప్రతీరోజు శిప్ర నదీ జలాలలతో అభిషేకం, ఆ తర్వాత చితాభస్మంతో అలంకరణ జరగడం విశేషంగా చెప్పుకోదగినవి. ఉజ్జయిని ఆలయం ఐదు అంతస్థులుగా, ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. అందులో ఒక అంతస్థును భూమికి క్రింద అంటే నేలమాళిగగా కట్టారు. ఆ క్రింది అంతస్థులో స్వయంభువు అయిన మహాకాళేశ్వర లింగం ఉంటుంది. దానిపైన అంతస్థులో ఓంకారేశ్వర మహాదేవ లింగం, మూడవ అంతస్థులో నాగచంద్రేశ్వర లింగం ఉంటాయి. ఈ 3 శివలింగాలే కాకుండా ఇంకా అనాది కల్పేశ్వరుడు, త్రివిశ్తపేశ్వరుడు, చంద్రాదిత్యేశ్వరుడు, స్వప్నేశ్వరుడు వంటి అనేక శివలింగాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. తూర్పు, పశ్చిమ దిక్కులలో కార్తికేయ, వినాయకుల ఆలయాలు ఉన్నాయి. శివుడు దక్షిణ దిశగా తిరిగి వెలిశాడు కనుక, నందీశ్వరుడు దక్షిణ దిక్కులోనే దర్శనమిస్తాడు. ఈ ఉజ్జయిని మందిరాన్ని ఒక తాంత్రిక మందిరంగా భావిస్తారు. వర్ణనలకు అందని ఆలయం పురాణాల ప్రకారం ప్రజాపిత బ్రహ్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో చంద్రప్రద్యోతుడు ఆలయ నిర్వాహకునిగా కుమారసేనుని నియమించాడు. క్రీ.పూ 4వ శతాబ్ది నాటి ఉజ్జయిని నాణేలపైన ఈ మహాకాలుని చిత్రం ఉంటుంది. కాళిదాసు తన రఘువంశం, మేఘదూతం వంటి కావ్యాలలో ఈ మందిరం గురించి అద్భుతంగా చేసిన వర్ణనలు ఉన్నాయి. ఆ ఆలయ నిర్మాణ కౌశలం అలనాటి ఉత్తమస్థాయి వాస్తుకళకు అద్దం పడుతుంది. విక్రమార్కుడు ఈ నగరాన్నే తన రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. భర్తృహరి మహారాజు ఇక్కడే తన సుభాషితాలను లిఖించాడు. కాళిదాసు ఈ అమ్మవారి కటాక్షంతోనే మహాకవిగా మారాడు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇండోర్ పట్టణం నుంచి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్షిప్రానది గలగలలు, రుద్రాసాగర్ సరస్సుతో ఈ ప్రాంతం ప్రకృతి రామణీయకతకు మారుపేరులా ఉంటుంది. ఖగోళశాస్త్ర అధ్యయనాల కేంద్రంగానూ ఉజ్జయిని పేరుగాంచింది. విక్రమ్ విశ్వవిద్యాలయం, కాళిదాస్ అకాడమీ ఇక్కడ చెప్పుకోదగినవి. శివరాత్రి, మహాకుంభ, అర్ధ కుంభ మేళా వంటి ఉత్సవాలకు ఈ నగరం ప్రసిద్ధి గాంచింది. హర హర మహాకాళ పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు నిరంతరం శివార్చనలో ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. వీరు రోజు శివార్చనే ఊపిరిగా ఉన్నవారు. ఓ రోజు వీరంతా శివార్చనలో ఉండగా పర్వత శిఖరాలలో ఉన్న దూషణుడు అనే రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఈ నలుగురి వద్దకూ వచ్చాడు. కానీ వారు బెదరలేదు. శివార్చనను వీడలేదు. అంతలో దూషణుడు ఆ బ్రాహ్మణుల మీదకు కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడు బూడిదరాశియై పడి ఉన్నాడు. ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు బెదరకుండా మహాకాళ రూపానికి స్త్రోతం చేశారనీ, భస్మహారతితో స్వామి ప్రసన్నుడు అయ్యాడనీ, వారి ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో వెలిశాడనీ కథనం. శిల్పాల సొగసు చూడతరమా! సరస్సు సమీపంలో గల ఈ దేవాలయం పైకి మూడు అంతస్థులుగా కనపడుతుంది. భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం... శిఖరం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. సాయంసంధ్యా సమయంలో ఈ మందిరం అత్యంత మనోహరంగా భాసిల్లుతుంది. ఇత్తడి దీపాలు భూగర్భగుడిలోకి పోయే మార్గాన్ని చూపిస్తాయి. ఇక్కడ పరమేశ్వరుడికి సమర్పించిన నైవేద్యం తిరిగి దేవతలందరికీ సమర్పించవచ్చని భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో ఒక చిత్రం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు ‘వర్షన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఈ తంతు కొనసాగతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే ‘శంఖుయంత్రం’ ఉందని పెద్దలు చెబుతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని అందుకే ఊదుతారని ప్రతీతి. మూడవ అంతస్థులో ఉన్న ‘నాగచంద్రేశ్వర’ విగ్రహం దర్శనానికి నాగపంచమి రోజున మాత్రమే తెరుస్తారు. మహాకాళేశ్వరుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారని భక్తుల అపార నమ్మకం. చితాభస్మంతో అభిషేకం వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్న భూగర్భాలయంలో రెండు జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలంటారు. ఇక్కడే భస్మమందిరం ఉంది. ఆవులను లోపలికి తొలుకువచ్చి, వాటి పేడతో అక్కడే విభూతిని తయారుచేసి, ఆ విభూతితో స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారు. ఇక్కడ చేసే విభూతి అభిషేకాలు రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసి మూట కడతారు. ఆ మూటను శివలింగంపైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం ఆలయం అంతా భస్మంతో నిండిపోతుంది. ఆ సమయంలో శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను మోగిస్తారు. అప్పుడు అక్కడి అలౌకిక స్థితి గురించి మాటల్లో చెప్పలేం. రెండవ రకం అభిషేకం అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మంతో చేస్తారు. రోజూ ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా ఈ భస్మహారతి (అస్థికల సమర్పణ) జరుగుతుంది. పది మంది నాగసాధువుల చేత జరిగే ఈ భస్మహారతి సయమంలో సాక్షాత్తూ కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మపూజ చేశాడంటారు. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని ‘మహా శ్మశానం’ అని కూడా పిలుస్తుంటారు. భస్మహారతికి కేవలం మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో, బారికేడ్ల వెనుక వరకే అనుమతిస్తారు. శిప్రానదిలో స్నానం, మహాకాళేశ్వరుని దర్శనం అకాలమృత్యువు నుంచి రక్షణ ఇస్తుందని, మరణానంతరం జీవనం ఉండదని భక్తుల అపారవిశ్వాసం. 12 ఏళ్ల కొకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతోంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. - ఎన్.ఆర్ అమ్మలగన్న అమ్మ గర్కాళిక అజ్ఞానం, చీకటి, శత్రు భయాలను పోగొట్టడానికి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు మహాకాళి రూపంలో ఉజ్జయినిలో కొలువై ఉన్నారు. గర్కాళికగా పూజలందుకుంటున్నారు. మహాకవి కాళిదాసు నాలుకపై అమ్మవారు బీజాక్షరాలు రాసింది ఇక్కడే. గర్భగుడిలో లింగం అగ్రభాగాన ‘ఓంకారేశ్వర మహాదేవ’ అని ఉంటుంది. గణేష్, ఓంకారేశ్వర్ శివ, పార్వతి, షణ్ముఖుడు, నంది విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడి దేవాలయ సముదాయం క్రీ.శ.1234-35లో ముసల్మానులు దాడి చేసిన సందర్భంలో ధ్వంసం అయ్యింది. తర్వాత క్రీ.శ.1736లో శ్రీమంత్ పీష్వా బాజీరావు, ఛత్రపతి షాను మహారాజ్‌లు ఇప్పుడు ఉన్న నిర్మాణం చేశారు. ఆ తర్వాత శ్రీనాథ్ మహాడ్జి షిండే మహారాజ్‌చే అభివృద్ధి జరిగినట్టు చరిత్ర చెబుతోంది. గిరిజనుల నగలు ప్రత్యేకం ఉజ్జయిని నగర వీధులలో టవర్ చౌక్‌లో దొరికే ఆహారాన్ని పర్యాటకులు బాగా ఆస్వాదిస్తుంటారు. నోరూరించే స్థానిక వీధి ఆహారాలైన చాట్లు, పానీపూరి, బేల్‌పూరీ, నెయ్యితో మొక్కజొన్న అల్పాహారం పదార్థాలు ఇక్కడ ప్రత్యేకం. ఉజ్జయిని నగరం గిరిజనుల నగలు, వస్త్రాలు, వెదురు ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని టూరిజం వారు నగరంలో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి నగర పరిధిలో ఆటో రిక్షాలు, బస్సులు, టాంగాలు అందుబాటులో ఉంచారు. నగరంలో ప్రయాణించడానికి ఎక్కువ శాతం పర్యాటకులు షేర్ ఆటో రిక్షాల వైపే మొగ్గుచూతారు. ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఇండోర్ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం నుంచి ఉజ్జయిని కేవలం 55 కి.మీ దూరం.ఉజ్జయిని రైల్వేస్టేషన్‌తో భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలనూ అనుసంధానించారు. {పయాణికులు ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ఇండోర్, భోపాల్, గ్వాలియర్ నుండి రోజువారీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ దగ్గర్లో హోటల్ వసతి సదుపాయాలున్నాయి. -
అతి పురాతన స్ఫటిక లింగం చోరీ
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అతి పురాతనమైన శివలింగాన్ని దొంగలు ఎత్తుకు పోయారు. ఎంచ గ్రామంలో మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కేదారీశ్వరి ఆలయం ఉంది. పానవట్టంపై ఉన్న స్ఫటిక లింగాన్ని శుక్రవారం అర్ధరాత్రి దొంగలు అపహరించుకుపోయారు. శనివారం ఉదయం పూజారి వచ్చి చూడగా స్ఫటిక లింగం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. -
‘రావణ దహనం’ సృష్టికర్త లింగం
ఆర్మూర్ టౌన్ : దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే రావణ సంహారం(దహనం) దృశ్య రూపకం పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 19 ఏళ్లుగా ఈ ఘట్టాన్ని చూసేందుకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. ఈ దృశ్యరూపకాన్ని సృష్టించి దసరా ఉత్సవాలకు శోభను తీసుకువచ్చి ప్రజలకు కనువిందు చేస్తున్నది పట్టణానికి చెందిన ఎలక్ట్రిక్ బ్రహ్మ బిరుదాంకితుడు చౌకె లింగం. స్థానిక జిరాయత్ నగర్లో నివాసముంటున్న చౌకె లింగం దసరా ఉత్సవాల్లో రావణ దహనానికి ఆద్యుడు. జంబి హనుమాన్ ఆలయంలో దసరా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా అంగరంగవైభవంగా జరిగినప్పటికీ లింగం రాకతో ఉత్సవాలకు మరింత శోభ సంతరించుకుంది. వీధి నాటకాలు, యక్షగానం, బుర్రకథలతో చౌకె లింగం ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చోట్ల ప్రదర్శన.. ఈ ఏడాది పట్టణంతో పాటు మండలంలోని అంకాపూర్, మిర్ధాపల్లి, నందిపేట్ మండలం వన్నెల్(కె), బాల్కొండ మండలం బోదెపల్లి, వేల్పూర్ మండలం పడిగెల్, ఇందల్వాయి మండల కేంద్రం, మోర్తాడ్ మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో రావణ దహనం ఘట్టాన్ని చౌకె లింగం సౌజన్యంతో నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లలో చౌకె లింగం బృందం నిమగ్నమయ్యింది. ఈ యేడు దుర్గామాత చేతిలో మహిషాసుర వధను వరుసగా రెండవ సంవత్సరం ప్రదర్శించేందుకు లింగం సన్నద్ధమవుతున్నారు. నా అదృష్టంగా భావిస్తున్నా పట్టణంలో దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రతి యేట నాకు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా ను. గతేడాది నుంచి రావణ సంహారంతో పాటు మహిషాసుర వధను ప్రదర్శిస్తున్నాం. కళాకారులకు, ప్రతిభావంతులకు ఆశించిన మేర గుర్తింపు లభించడం లేదు. - చౌకె లింగం, రావణ దహనం సృష్టికర్త, ఆర్మూర్ -
గుడిలో లింగాన్నీ ఎత్తుకెళ్లారు..!
గుప్త నిధుల కోసమేనని అనుమానం కొందుర్గు, న్యూస్‌లైన్ : గుడినేకాదు.. గుళ్లోని లింగాన్నీ మింగేస్తారనే సామెత నిజం చేసి చూపించారు కొందరు దొంగలు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం రావిర్యాలలో సామెతకు ఆచరణ రూపమిచ్చి ఔరా.. అనిపించారు. పోలీసుల కథనం మేరకు .. గ్రామశివారులో ఉన్న సోమలింగేశ్వరస్వామి ఆలయంలో దుండగులు శివలింగాన్నే దొంగిలించేశారు. ఈ ఆలయంలో ప్రతిసోమవారం ప్రత్యేక పూజలు జరుగుతారుు. ఎప్పటిలాగే పూజ చేయడానికి ఆలయూనికి వెళ్లిన భక్తులు శివలింగం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. విషయం దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ప్రభులింగంకు సమాచారం అందించారు. ఆయన విషయూన్ని పోలీసులకు చెప్పగా ఏఎస్ఐ కృష్ణయ్య సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. ఆలయం వెలుపలగల స్వామివారి పాదాలను కూడా పెకిలించడంతో గుప్తనిధుల కోసం ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. కేసు దర్యాప్తులో ఉంది.