సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేంతవరకు ఎక్కడికక్కడ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో కలిపి లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
వయోభారంతో మానసికంగా నిరుద్యోగులు కుంగిపోతున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా డీఎస్సీ లేదని, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులను నిరుద్యోగులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని లింగంగౌడ్ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment