లింగం నాయీ
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బీసీల్లో తమ కులం బాగా వెనుకబడి ఉందని.. తమను చట్టసభకు పంపించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైస్థాయికి తీసుకురావాలని కోరింది. ఈ మేరకు నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు అన్నిరకాలుగా వెనుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమ కులానికి చెందిన వారెవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కాలేదని వెల్లడించారు. ఇతర వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించినట్టుగానే తమకు కూడా అవకాశం ఇవ్వాలని మఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు విజ్ఞప్తి చేశారు. నాయీబ్రాహ్మణులను శాసనమండలి, రాజ్యసభకు నామినేట్ చేసి న్యాయం చేయాలని లింగం నాయీ కోరారు. రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment