అతి పురాతన స్ఫటిక లింగం చోరీ
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అతి పురాతనమైన శివలింగాన్ని దొంగలు ఎత్తుకు పోయారు. ఎంచ గ్రామంలో మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కేదారీశ్వరి ఆలయం ఉంది. పానవట్టంపై ఉన్న స్ఫటిక లింగాన్ని శుక్రవారం అర్ధరాత్రి దొంగలు అపహరించుకుపోయారు. శనివారం ఉదయం పూజారి వచ్చి చూడగా స్ఫటిక లింగం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు.