Sivalayam
-
2000 వేల ఏళ్ల నాటి శివాలయంలో ఘనంగా శివరాత్రి సంబరాలు
-
శివయ్యను తాకిన సూర్య కిరణాలు.. పెదపులివర్రులో అపురూప దృశ్యం
పెదపులివర్రు (భట్టిప్రోలు/గుంటూరు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొలువైన బాలా త్రిపుర సుందరీ సమేత రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం స్వామి వారి లలాటాము, అమ్మవారి పాదాల కింద సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6:40 గంటల నుంచి 16 నిముషాల పాటు ఈ కిరణాలు ప్రసరించాయి. దీనినే షోడశ కళలు అని పేర్కొంటారని వేద బ్రాహ్మణుడు ఆమంచి సృజన్ కుమార్ తెలిపారు. ఈ దేవాలయంలో సూర్య కిరణాలు సంవత్సరంలో మే, జూన్, జూలై, ఆగస్టు నాలుగు నెలలు సూర్య కిరణాలు ప్రసరిస్తాయన్నారు. సూర్యుడు మేష రాశి నుంచి ప్రవేశించినప్పుడు ఒక సారి, వృషభ రాశిలో ఒకసారి, మిథున రాశిలో ఒక మారు, కర్కాటక రాశిలో ఒక సారి కిరణాలు ప్రసరిస్తాయన్నారు. ఈదృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. (చదవండి: మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న) -
నంది విగ్రహం అపహరణ
కుందుర్పి: పోలీసుల నిర్లక్ష్యం.. గ్రామస్తుల అభద్రతాభావం కారణంగా దుండగులు గుప్త నిధుల కోసం నిజవళ్లి గ్రామంలోని పురాతన శివాలయంలో గల నంది విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే ఐదుగురు వ్యక్తులు ఓమిని వాహనంలో వచ్చి శివాలయంలో నంది విగ్రహానికి పూలు చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయలేదు. ఆదివారం తెల్లవారుజాముకల్లా నంది విగ్రహం కనిపించలేదు. అర్ధరాత్రి వచ్చి పూజలు చేసిన వారే విగ్రహాన్ని అపహరించుకుపోయి ఉంటారని భావించి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణకు గ్రామస్తులు ఫిర్యాదు చే శారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ శ్రీనివాసులు, జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పరిశీలించారు. గతంలో కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. -
31న శివాలయంలో అర్చకుల సమావేశం
అనంతపురం కల్చరల్ : జిల్లా అర్చక సంఘం నేతృత్వంలో ఈ నెల 31న మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో అర్చకుల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా కార్యదర్శి వాస్తు వెంకటరామయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశంలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామన్నారు. అందువల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్చకులంతా సమావేశానికి తరలిరావాలన్నారు. -
అతి పురాతన స్ఫటిక లింగం చోరీ
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అతి పురాతనమైన శివలింగాన్ని దొంగలు ఎత్తుకు పోయారు. ఎంచ గ్రామంలో మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన కేదారీశ్వరి ఆలయం ఉంది. పానవట్టంపై ఉన్న స్ఫటిక లింగాన్ని శుక్రవారం అర్ధరాత్రి దొంగలు అపహరించుకుపోయారు. శనివారం ఉదయం పూజారి వచ్చి చూడగా స్ఫటిక లింగం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. -
అసిఫాబాద్లో కోర్టు భవనాలు ప్రారంభం
అసిఫాబాద్: ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ పట్టణంలో కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, హైకోర్టు పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ సీతారామమూర్తి శనివారం ఉదయం ప్రారంభించారు. రూ.89 లక్షలతో కోర్టు భవనాలను ఇక్కడ నిర్మించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. శివాలయంలో హైకోర్టు జడ్జి పూజలు ఆదిలాబాద్ జిల్లా రెబ్బిన మండలం నంబాల గ్రామంలో ఉన్న శివాలయంలో హైకోర్టు జడ్జి చంద్రయ్య శనివారం ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ పూజారి, గ్రామ పెద్దలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు. -
దేవుణ్ని గుండెల్ల్లో దాచుకోండి... కెమెరాల్లో కాదు!
అనగనగా ఓ అడవి. ఆ అడవిలో చిన్న ఊరు. ఆ ఊళ్లో చక్కటి శివాలయం. ఆలయం పక్కనే జలపాతం. ఆ ప్రవాహంలో కాళ్లు కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకుని ఆలయం లోపలికెళ్తే... అంతా నిశ్శబ్దం. ‘కదలండి’ అంటూ తోసేవాళ్లుండరు. పరమశివుడిని కళ్లారా చూసుకోవచ్చు. పూజారి కనిపించడు. ఎవరి పూజ వాళ్లే చేసుకోవాలి. చేతులు జోడించి నమస్కారం చేసుకున్న తర్వాత అలవాటుగా పర్సు తీసి దేవునికి కానుక వేద్దామని చూస్తే ఎక్కడా హుండీ కనిపించదు. ఒకవేళ అక్కడే ఉన్న పళ్లేలలో వేసినా కూడా ఆలయం బాగోగులు చూసే గిరిజనులు వచ్చి డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు. ఈ విశ్వేశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం పేరంటాల పల్లిలో ఉంది. ఇది నిన్నమొన్నటి వరకు ఖమ్మం జిల్లా. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంలో భాగంగా ఆ గ్రామాన్ని తూర్పు గోదావరి జిల్లాకు బదలాయించడమైంది. ఇది పూర్తిగా గిరిజనుల ఆవాసం. కొండరెడ్డి జాతి ఇక్కడ ఎక్కువగా నివసిస్తోంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను ఈ గిరిజనులే నిర్వహిస్తారు. ఆలయం పక్కనే ఉన్న సెలయేటి నుంచి నీటిని తెచ్చి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. పూజ చేస్తారు. ఆలయ నిర్వహణ కోసం గిరిజనేతరుల నుంచి విరాళాలు సేకరించరు, పర్యాటకులు విరాళాలివ్వజూపినా స్వీకరించరు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ ఊళ్లో వాళ్లంతా కలిసి వేడుక చేసుకుంటారు. అందరూ తలా ఓ పని చేసి ఊరంతటికీ వంటలు చేస్తారు. సామూహికంగా భోజనాలు చేస్తారు. దేవుడికి భజనలు చేస్తారు. మద్యం సేవించిన వారికి, మాంసం భుజించిన వారికీ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. ఆలయంలో ఫొటోలు తీయరాదు. దేవుడిని మనసులో ప్రతిష్ఠించుకోవాలి తప్ప కెమెరాల్లో కాదంటారు. పైగా అది పాపం అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా... పాపి కొండల పర్యటనకు వచ్చే వారంతా ఈ ఆలయాన్ని, పక్కనే ఉన్న ఆశ్రమాన్ని చూస్తారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రూపాయి కానుకగా సమర్పించినా ఇప్పటికి ఆలయానికి కోట్ల రూపాయల నిధి జమ అయ్యేది. కానీ దేవుణ్ని డబ్బుతో కాదు మనసుతో చూడాలంటారు ఈ గిరిజనులు. పేరంటపల్లిలో కొండ దరిగా పనసచెట్టు నీడన అమ్మవారు ఎల్లమ్మ (విశ్వమాత) పేరుతో వెలిసింది. అమ్మవారు ఒకనాడు పరివ్రాజకులైన (సన్యాసి) బాలానంద స్వామికి ప్రత్యక్షమై అతడిని అనుంగు బిడ్డగా స్వీకరించిందని, అతడిని విశ్వేశ్వర లింగం ఉన్న చోటికి తీసుకువచ్చి ఆమె శివలింగంలో లీనమైందని చెబుతారు. ఆ విశ్వమాత ఆదేశానుసారమే బాలానంద 1927లో చిన్న తిన్నె మీద అమ్మవారిని ప్రతిష్టించారు. అదే ప్రదేశంలో రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. తర్వాత కొన్నేళ్లకు... అంటే 1963లో స్వామి వివేకానంద శతజయంతిని పురస్కరించుకుని సర్వమత సామరస్యాన్ని తెలుపుతూ ఆయా చిహ్నాలతో పరిపూర్ణమైన ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వర లింగాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఇదీ ఆలయ చరిత్ర. బాలానంద స్వామికి వయసుడిగి ఆరోగ్యం క్షీణించడంతో ఆలయ నిర్వహణ బాధ్యతను స్థానిక గిరిజనులకు అప్పగించారు. ఆలయ బాధ్యతను అప్పగించేటప్పుడు ఆయన చెప్పిన నియమాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు గిరిజనులు. స్వామీజీ చెప్పిన అన్ని నియమాలలోనూ పరమార్థం ఎంతో కొంత తెలుస్తోంది కానీ ఆలయం బయట ఉన్న గంటను ఒక్కసారి మాత్రమే మోగించాలనే నియమం ఎందుకో తెలియదంటారు. - అశోక్, సాక్షి, పేరంటపల్లి -
శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భోళా శంకరుడిని దర్శనానికి భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. హర హర మహాదేవ.. శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ భక్తులు తరిస్తున్నారు. శివ మాలధారులు భక్తులకు, స్వాములకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు పది గంటల సమయం పడుతోంది. సుమారు మూడు లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 10.30గంటలకు పాద అలంకరణ అనంతరం స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. హరహర శంభో నామస్మరణలతో దక్షిణకాశి మారుమోగిపోతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే మహాశివుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలువైపుల నుంచి తరలివచ్చిన అశేష భక్తవాహినితో ఆలయం కిటకిటలాడుతోంది. స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, స్వామి అమ్మవార్ల సేవలో తరిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా .. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. చిత్తూరుజిల్లా కమ్మసంద్రలోని శ్రీకోటి లింగేశ్వరాలయం ఆధ్మాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. 108 అడుగుల మహా శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా శివరాత్రి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పంచారామాలైన శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర జనార్థనస్వామి ఆలయం భక్తులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల ఎదుట బారులు దీరారు. పరమ శివుడికి బిల్వార్చన పూజ, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా .. ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, ప్రసాదం, మంచినీరు, మజ్జిగను ఏర్పాటు చేశారు. శివరాత్రిని పురస్కరించుకుని పవిత్ర గోదావరి నదీతీరం శివనామ స్మరణలతో మారుమాగుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన శివభక్తులతో రాజమండ్రి జనసంద్రంలా మారింది. భక్తులు పుణ్యస్నానాలకు గోదావరి రేవులకు చేరడంతో రాజమండ్రిలోని కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, విఐపిఘాట్, మార్కేండయస్వామి రేవు, ఇసుక రేవులు భక్తులతో నిండిపోయాయి. మరోవైపు కోటగుమ్మంలోని శివుని విగ్రహంతో పాటు శివాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. పంచారామక్షేత్రాలలో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ గౌలిపురా మిత్రాక్లబ్లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తుల సందర్శనార్థం ప్రతిష్టించారు. ఈనెల 25నుంచి మార్చి 1వరకు జ్యోతిర్లింగాల దివ్యదర్శనం ఉంటుంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనతో పాటు సాంస్క్రతిక కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత మెడిటేషన్ శిబిరంతో పాటు స్పిర్చివల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా వేయి స్థంభాల దేవాలయంలో మహశివరాత్రి ఉత్సవాలు శుభారంభమయ్యాయి.రుద్రాభిషేకంతో మొదలై ఐదురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేయిస్థంభాల దేవాలయంతో పాటు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామప్ప, గణపురం కోటగుడి, కురవి వీరభ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మంజిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలంనాటి కూసుమంచి శివాలయం దక్షిణభారతదేశంలోనే మూడవ అతిపెద్ద దేవాలయంగా పేరు గాంచింది. భారీగా తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ఆలయంలో వెయ్యి టన్నుల బంగారు నిధి?
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ నిధిలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు చెబుతున్నారు. వెయ్యి టన్నులా? అసలు అంత బంగారం ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. అయితే ఉన్నా ఉండవచ్చు అంటున్నారు. కేరళలోని త్రివేండ్రం పద్మనాభస్వామి ఆలయంలో వెలుగు చూడలేదా? అని ప్రశ్నిస్తున్నారు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఈ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెబుతున్నారు. ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో అక్కడ తవ్వకాలను ఈ నెల 18 నుంచి చేపట్టనున్నారు. ఈ నిధి చుట్లూ రాజు ఆత్మ తిరుగుతోందని స్వామి అంటున్నారు. తనకు విముక్తి కల్పించాలని ఆ ఆత్మ కోరుతున్నట్లు స్వామీజీ చెప్తున్నారు. బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకుంటున్నారు. నిధి విషయం తెలిసినప్పటి నుంచి ఊళ్లో మగవాళ్లందరూ పనులు మానేసి గుడి చుట్టు కాపలా కాస్తున్నారు. ఇక తమ దశ తిరిగిపోయినట్లు వారు ఊహించుకుంటున్నారు.