కుందుర్పి: పోలీసుల నిర్లక్ష్యం.. గ్రామస్తుల అభద్రతాభావం కారణంగా దుండగులు గుప్త నిధుల కోసం నిజవళ్లి గ్రామంలోని పురాతన శివాలయంలో గల నంది విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే ఐదుగురు వ్యక్తులు ఓమిని వాహనంలో వచ్చి శివాలయంలో నంది విగ్రహానికి పూలు చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయలేదు.
ఆదివారం తెల్లవారుజాముకల్లా నంది విగ్రహం కనిపించలేదు. అర్ధరాత్రి వచ్చి పూజలు చేసిన వారే విగ్రహాన్ని అపహరించుకుపోయి ఉంటారని భావించి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణకు గ్రామస్తులు ఫిర్యాదు చే శారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఐ శ్రీనివాసులు, జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పరిశీలించారు. గతంలో కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి.
నంది విగ్రహం అపహరణ
Published Sun, Aug 13 2017 10:46 PM | Last Updated on Tue, Sep 12 2017 12:00 AM
Advertisement