nijavalli
-
నంది విగ్రహం అపహరణ
కుందుర్పి: పోలీసుల నిర్లక్ష్యం.. గ్రామస్తుల అభద్రతాభావం కారణంగా దుండగులు గుప్త నిధుల కోసం నిజవళ్లి గ్రామంలోని పురాతన శివాలయంలో గల నంది విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. శనివారం అర్ధరాత్రి సమయంలోనే ఐదుగురు వ్యక్తులు ఓమిని వాహనంలో వచ్చి శివాలయంలో నంది విగ్రహానికి పూలు చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసినా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయలేదు. ఆదివారం తెల్లవారుజాముకల్లా నంది విగ్రహం కనిపించలేదు. అర్ధరాత్రి వచ్చి పూజలు చేసిన వారే విగ్రహాన్ని అపహరించుకుపోయి ఉంటారని భావించి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణకు గ్రామస్తులు ఫిర్యాదు చే శారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఐ శ్రీనివాసులు, జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పరిశీలించారు. గతంలో కూడా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. -
మహిళ బలవన్మరణం
కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో గిరిజమ్మ(36) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... మృతురాలి భర్త శ్రీనివాసులు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో చీటికీ మాటికి భార్యతో తరచూ గొడవపెట్టుకునేవాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ సోమవారం రాత్రి గొడవపడ్డాడు. దీంతో ఆమె ఇక భరించలేకపోయింది. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి, వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వివరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. గిరిజమ్మ మృతికి కారణమైన భర్త శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రీ బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.