సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా లో నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నంది విగ్రహం ధ్వంసం కోసం వినియోగించిన పనిముట్లను స్వాదీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 27 న జిల్లాలోని ఆగర మంగళం గ్రామం లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ని నంది విగ్రహాన్ని దుండగులు పెకిలించి తర్వాత ధ్వంసం చేశారు. ఈ ఘటన మీద వెంటనే విచారణ చేపట్టామని తెలిపారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. (చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం)
ముఠాలో మొత్తం 8 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో.5గురు కర్ణాటక వాసులు కాగా ఇద్దరు చిత్తూరు జిల్లా వాలు ఒకరు కర్నూలు వాసి అని తెలిపారు. ఈ ముఠాకు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సోమశేఖర్ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఈ ముఠా చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో పురాతన ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతూ వచ్చిందంన్నారు. గుప్త నిధుల కోసం విగ్రహాలను ధ్వంసం చేయడమే ఈ ముఠా పనిగా పెట్టుకొందన్నారు. ముఠా నుంచి విగ్రహాల ధ్వంసానికి వినియోగించిన పని ముట్లను కూడా స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. (‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’)
Comments
Please login to add a commentAdd a comment