
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ పూర్వవిద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ వన్‌టైం చాన్స్ నాన్‌సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29నుంచి ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కాలేజీల్లో 1995 నుంచి నేటి వరకు బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే ఈ వన్‌టైం చాన్స్ పరీక్షలకు నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఉస్మానియా వర్సిటీ వెబ్‌సైట్ నుంచి లేదా ఓయూక్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి హాల్‌టికెట్లను పొందవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment