సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజులలో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
రూ 200 అపరాధ రుసుంతో జూన్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షా ఫీజులను ఈ నెల 16 నుంచి వచ్చే నెల 8 వరకు చెల్లించాలని సూచించారు. రూ 300 అపరాధ రుసుంతో జూన్ 15 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ కోర్సులకు 2.20 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా వివిధ పీజీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షలకు 10 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పూర్తి వివరాలు ఓయూ వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment