
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో అన్వర్ ఉల్ ఉలూమ్ జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో అన్వర్ జట్టు 3 స్వర్ణాలు, 2 కాంస్యాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. 3 రజతాలు గెలుపొందిన అంజద్ అలీఖాన్ బిజినెస్ స్కూల్ రన్నరప్‌గా నిలవగా... గెలాక్సీ, వేద, సిద్ధార్థ డిగ్రీ కాలేజీ జట్లు సంయుక్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
అన్వర్ ఉల్ ఉలూమ్ జట్టు తరఫున మొహమ్మద్ జావీద్ ఖాద్రి (60 కేజీలు), అబ్దుల్లా హమామీ (65 కేజీలు), మొహమ్మద్ ఫిరోజ్ (90 కేజీలు) స్వర్ణాలను అందుకున్నారు. షేక్ ఒమేర్ (60 కేజీలు), మొహమ్మద్ అల్తాబ్ ఖాన్ (70 కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ పురుషుల ఇంటర్ కాలేజి టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.
ఇతర వెయిట్ కేటగిరీల విజేతలు
60 కేజీలు: 1. జావీద్ ఖాద్రి, 2. మొహమ్మద్ ఖాజా (ఇన్‌ఫాంట్ డిగ్రీ కాలేజి), 3. షేక్ ఒమేర్.
65 కేజీలు: 1. అబ్దుల్లా హమామి, 2. కె. రాజు (సిటీ కాలేజి), 3. రంజిత్ కుమార్ (అంబేడ్కర్ డిగ్రీ కాలేజి).
70 కేజీలు: 1. చింటు కుమార్ (సిద్ధార్థ), 2. అబ్దుల్ అల్తాఫ్ (అంజద్ అలీఖాన్), 3. అల్తాబ్ ఖాన్
75 కేజీలు: 1. జి. వినయ్ సాయి (వేద డిగ్రీ కాలేజి), 2. మొహమ్మద్ ఖైరుల్ (అంజద్ అలీఖాన్), 3. ఫైజాన్ అలీఖాన్ (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి).
80 కేజీలు: 1. మొహియుద్దీన్ (గెలాక్సీ డిగ్రీ కాలేజి), 2. బకీర్ హుస్సేన్ (అంజద్ అలీఖాన్), 3. శ్రియాస్ (ఎంవీఎస్‌ఆర్).
85 కేజీలు: 1. సలా బిన్ హుస్సేన్ (శ్రీ సాయి డిగ్రీ కాలేజి).
90 కేజీలు: 1. మొహమ్మద్ ఫిరోజ్.
90 ప్లస్ కేజీలు: 2. నవీన్ (అవంతి డిగ్రీ కాలేజి).