
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రొఫెసర్ పాపిరెడ్డి జనవరి 7వ తేదీన విడుదల చేశారు.ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్మిటీ డిసెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 85270 మంది దరఖాస్తు చేసుకోగా.. 72467 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 70141 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com లో చూడొచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment