ఓయూ మహిళల టెన్నిస్‌ జట్టుకు స్వర్ణం | OU women lWins tennis title at Khelo India University Games | Sakshi
Sakshi News home page

ఓయూ మహిళల టెన్నిస్‌ జట్టుకు స్వర్ణం

Published Mon, May 2 2022 9:13 AM | Last Updated on Mon, May 2 2022 9:13 AM

OU women lWins tennis title at Khelo India University Games - Sakshi

బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్‌ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్‌ మ్యాచ్‌లోని తొలి సింగిల్స్‌లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది.

రెండో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్‌పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్‌ కోచ్‌గా, సయ్యద్‌ ఫారూఖ్‌ కమాల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు.

చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్‌ కప్‌ టోర్నీపై దృష్టి: పీవీ సింధు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement