Bengalore city
-
స్కూల్స్‌లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, ఇటీవలే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కర్నాటకలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 31 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. న్యూ స్టాండర్డ్ పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎంఈఎస్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే వీరందరూ కరోనా బారినపడటం ఆందోళక కలిగిస్తోంది. ఇక, సదరు విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారు కరోనా బారినపడినట్టు తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం వెంటనే రెండు పాఠశాలలను శానిటైజ్ చేపించారు. మరోవైపు.. కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, సిబ్బందికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉంటే.. వారికి వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. సిబ్బందికి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నారో లేదో స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించింది. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 582 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు! -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌లోని తొలి సింగిల్స్‌లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్‌పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్‌గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్‌గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
Hamsa Nandini Nanduri: కంటేనే అమ్మ అంటే ఎలా?.. దత్తత తీసుకున్నా అమ్మే..!
Hamsa Nandini Nanduri: Adopted Children Why Discriminate Against Me: జన్మనిస్తేనే తల్లా, దత్తత తీసుకుంటే తల్లికాదా? ఎందుకీ వివక్ష? జన్మనిచ్చినా, ఇవ్వకపోయినా పిల్లల్ని దత్తత తీసుకుని, తల్లి అయిన తరువాత ఆ చిన్నారుల ఆలనాపాలన చూడడంలో ఈ ఇద్దరు తల్లులు పడే ఆరాటం ఒకటే. అటువంటప్పుడు ప్రసూతి హక్కులను ఇద్దరికీ ఎందుకు సమానంగా కేటాయించట్లేదు? అని ప్రశ్నిస్తోంది హంసనందిని నండూరి. ప్రశ్నించడం దగ్గరే ఆగిపోకుండా నాలుగడుగులు ముందుకేసి ’వివక్ష లేకుండా తల్లులందరికీ ఒకేరకమైన హక్కులు కల్పించాలని, మెటర్నిటీ చట్టంలో మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టులో సైతం పోరాటం చేస్తోంది. బెంగళూరుకు చెందిన హంసనందిని నండూరి దంపతులకు పెళ్లై ఐదేళ్లు అయినా సంతానం కలగకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. వెంటనే పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న ఏడునెలల్లోనే వారికి కాల్ వచ్చింది. దీంతో 2016లో కారా(సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ) పద్ధతిలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఐదేళ్ల పాపని, రెండేళ్ల బాబుని దత్తత తీసుకున్నారు. పన్నెండు వారాలే.. పిల్లలిద్దరూ ఈశాన్య భారతదేశానికి చెందిన వారు కావడం, హిందీ మాత్రమే తెలిసి ఉండడంతో నందిని దంపతులకు పిల్లలకు దగ్గరవడం కాస్త కష్టమైంది. దీంతో నందిని తను పనిచేసే లాఫాంలో ప్రసూతి సెలవుకోసం దరఖాస్తు చేసుకుంది. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ –1961 ప్రకారం మూడు నెలల్లోపు పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును లా ఫామ్ మంజూరు చేసింది. పన్నెండు వారాల్లో ఆ పిల్లలిద్దరికి దగ్గరవడం కష్టం. బిడ్డకు జన్మనిచ్చిన అమ్మలకు ఇచ్చినట్లే.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా 26 వారాల ప్రసూతి సెలవు అవసరమని హంసనందినికి అర్థమైంది. కానీ ఆ అవకాశం లేదు. దీంతో జీతం నష్టపోయినా పర్వాలేదనుకుని మరో మూడు నెలలు సెలవు తీసుకుని పిల్లలకు దగ్గరైంది. హార్ట్మామ్స్ నీడ్ లవ్.. ‘‘ఏ తల్లికైనా అవే బాధ్యతలు ఉంటాయి. జన్మనిచ్చిన తల్లులకు, దత్తత తీసుకున్న తల్లులకు ఎందుకు ఈ వివక్ష. వారిలాగే దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్–1961 ప్రయోజనాలు చేకూరాలి. దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ సెలవులు సమానం గా ఇవ్వాలి’’ అని ‘హార్ట్ మామ్స్ నీడ్ లవ్’ పేరిట ఛేంజ్ డాట్ ఓ ఆర్జీ పిటిషన్ వెబ్‌సైట్‌ను నడుపుతోంది. దీనిద్వారా పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా సాధారణ తల్లులకు వర్తించే ప్రసూతి హక్కులను కల్పించాలని పోరాటం చేస్తోంది. ‘‘పురిటి నొప్పులు అనుభవించనంత మాత్రాన దత్తత తల్లి తల్లి కాకుండా పోదు. నిజానికి జన్మనిచ్చిన తల్లుల కంటే దత్తత తీసుకున్న తల్లులు బిడ్డకు దగ్గరవ్వడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. కొత్తగా వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులుగా మానసికంగా, శారీరంగా వారిని దృఢపరచాలి. ఇవన్నీ చేయడానికి చాలా సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది.’’ అని చెబుతున్న నందిని ప్రస్తుతం ఓ కంపెనీ లీగల్ హెడ్‌గా పనిచేస్తోంది. సుప్రీంకోర్టు దృష్టికి ఆమె ఈ అంశాన్ని తీసుకెళ్లింది. చట్టప్రకారం.. ఇటీవల హంసనందిని పిల్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ చట్టం–1961 సెక్షన్ 5(4), రాజ్యాంగం పరంగా ఎందుకు అమలు కావడం లేదు? అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఎంతోమంది తల్లుల ఆవేదనకు అక్షర రూపమే నందిని వాదన. తనకు ఆ సౌలభ్యం లేకపోయినప్పటికీ తనలాంటి వారెందరికో ఉపయోగపడుతుందని పోరాడుతోంది. సానుకూల తీర్పువస్తే ఎంతోమంది దత్తత తల్లులకు లాభం చేకూరుతుంది. చదవండి: వెంటాడే చిత్రాలు.. -
అక్కడ ఓలా, ఉబెర్‌కు షాక్!
సాక్షి, బెంగళూరు: క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. బెంగళూరులో మరో కొత్త క్యాబ్ అగ్రిగేటర్ రంగంలోకి దిగుతోంది. క్యాబ్ సేవల మార్కెట్‌ను ఏలుతున్న ఈ దిగ్గజాలకు నగరంలో భారీ షాక్ తగలనుంది. ‘హోయసాల క్యాబ్స్’ పేరుతో కొత్త క్యాబ్ సంస్థ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు మంచి ప్రయోజనాలు అందించనున్నామని కంపెనీ చెబుతోంది. రూ. 6 కోట్ల పెట్టుబడితో నగరంలో క్యాబ్ సేవలను సెప్టెంబర్ 1 నుంచి లాంచ్ చేయనుంది హోయసాల క్యాబ్స్. ఈ మేరకు ఒకమొబైల్ యాప్‌ను కూడా రూపొందించామని సంస్థ ప్రతినిధి ఉమా శంకర్ తెలిపారు. ప్యాసింజర్లు, డ్రైవర్లు ఇద్దరికీ తమ సంస్థ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ‘పీక్ హవర్ చార్జీ’ పేరుతో అదనపు చార్జిని తాము వసూలు చేయబోమని వెల్లడించారు. 2500కు పైగా క్యాబ్స్, మరింత ఎక్కువమంది డ్రైవర్లు, తన ప్లాట్‌ఫాంలో చేరతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంపెనీ సీవోవో జయసింహ. అంతేకాదు తమ డ్రైవర్లకు నగదు బహుమతులకు బదులుగా, ఉచిత తీర్థయాత్రలు, పిల్లలకు స్టడీ స్కాలర్షిప్లు, ఉచిత ఇంగ్లీష్ లెర్నింగ్ తరగతులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!
లండన్: ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో బతికేయగల 10 నగరాల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో వెనిజులా రాజధాని కరాకస్ మొదటి స్థానాన్ని సంపాదించుకోగా సిరియా రాజధాని డమాస్కస్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి 3 నగరాలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 5వ స్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ 8, 10వ స్థానాల్లో నిలిచాయి. 2019 సంవత్సరానికిగాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, జీవన వ్యయం ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది. కాగా బెంగళూరును చౌకైన నగరంగా గుర్తించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై నగరాల కన్నా బెంగుళూరు అత్యంత ఖరీదైన నగరమని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాలు 1. కరాకస్ (వెనెజులా) 2. డమాస్కస్ (సిరియా) 3. తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) 4. అల్మాటి (కజకిస్థాన్) 5. బెంగళూరు (భారత్) 6. కరాచి (పాకిస్తాన్) 6. లాగోస్ (నైజీరియా) 8. బ్యూనస్ ఐరిస్(అర్జెంటీనా) 8. చెన్నై (భారత్) 10. న్యూఢిల్లీ (భారత్) -
ఇక స్విగ్గీ, జొమాటోలకు ‘ఎసరు’!
సాక్షి, బెంగళూరు: హఠాత్తుగా వేసవి వర్షాలు పలకరించడంతో బెంగళూరు వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇంకా కురుస్తున్న చినుకుల మాటున వీస్తున్న సన్న గాలులకు మట్టి పరిమళాలు వచ్చి ముక్కును తాకుతుంటే డాక్టర్ జయశ్రీ గోపాలన్ మైమరచిపోతున్నారు. మహాదేవపురలోని అపార్ట్మెంట్, 15వ అంతస్తులో నిలబడి వర్షపు జల్లులకు పులకించిపోతున్న ఆమెకు హఠాత్తుగా ఆకలి గుర్తుకు వచ్చింది. ‘అబ్బా! ఈ వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటేనా!’ అనుకోగానే ఆమె నోటిలో నీళ్లూరాయి. ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉంది. తాను ఒక్కదాని కోసం ఇప్పుడు బజ్జీలు చేసుకోవాలా? అనుకున్నట్లున్నారు. వెంటనే చేతిలోకి సెల్ తీసుకున్నారు. అందులో ‘స్నాక్స్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు ‘స్నాక్స్ ఏమున్నాయి ?’ అంటూ మెస్సేజ్ పెట్టారు. ‘ఎనిమిది ప్లేట్ల ఆలు, ఉల్లిపాయ బజ్జీలు చేస్తున్నాను. ఇప్పటికే ఆరు ఆర్డర్లు వచ్చాయి, మీకు కావాలంటే ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి, అరగంటలో పంపిస్తాను’ అంటూ వెంటనే సమాధానం వచ్చింది. జయశ్రీ వెంటనే ఓ ప్లేట్ ఆర్డర్ ఇచ్చారు. 20 నిమిషాలు తిరక్కుండానే టిఫిన్ డబ్బాలో వేడి వేడి బజ్జీలు పట్టుకొని ఆ వంట మనిషి పిల్లవాడు వచ్చి ఇచ్చాడు. 30 రూపాయల బిల్లు తీసుకొని వెళ్లిపోయాడు. ‘ఆహా! ఎంత బాగున్నాయి. అచ్చం నేను చేసికున్నట్లే ఉన్నాయి’ అంటూ జయశ్రీ వాటన్నింటిని తినేసింది. ఇలా అడిగిన వారికి అడిగినట్లుగా ఉదయం ఇష్టమైన టిఫిన్లు, మధ్యాహ్నం మంచి భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ చేసి పెడుతోంది అదే ఆపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న ఓ వంటామే. ఆ అపార్ట్మెంట్లో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. బిజీబీజీగా ఉండే ఆ కుటుంబాలు ఎక్కువ సార్లు ఈ వంటామేపైనే ఆధారపడుతున్నారు. ఇరుగు పొరుగు అపార్ట్మెంట్ల వారు కూడా ఈ మధ్య ఆ వంటామనే ఆశ్రయిస్తున్నారట. ఇలాంటి వంటామే ఒక్క మహాదేవపురలోనే కాదు, సర్జాపూర్, బన్నేర్‌గట్టా, హెన్నూర్ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లకు విస్తరించారు. పక్క పక్కనే ఉన్న ఆపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారందరితోని వాట్సాప్‌లో స్నాక్స్ అనో, బ్రేక్‌ఫాస్ట్ అనో, లంచ్ అనో, డిన్నర్ అనో, హోం ఫుడ్ అనో ఓ గ్రూప్‌ను చేసుకొని వంటామెలు (కొన్ని చోట్ల వంటాయనలు కూడా ఉండవచ్చు) మంచి ఓ హోమ్ ఫుడ్‌ను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి వారితోనే కొంత పెద్ద మొత్తంలో ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్ పుట్టుకొచ్చింది. దీన్ని రచనా రావు, అనూప్ గోపీనాథ్, అకిల్ సేతురామన్ ఇదివరకే ఏర్పాటు చేయగా, కొత్తగా ఊటాబాక్స్, మసాలా బాక్స్ అనే గ్రూపులు పుట్టుకొచ్చాయి. ‘ఫుడ్డీ బడ్డీ’ గ్రూప్‌లో 20 వేల మంది ఉండగా, పూటకు రెండున్నర వేల ఆర్డర్లు వస్తున్నాయట. అందరిదీ ఒకటే సూత్రం. హోం ఫుడ్. రుచితోపాటు పరిశుభ్రతను పాటించడం, బయట హోటళ్ల కంటే తక్కువ రేటుకు విక్రయించడం వల్ల వీటి ప్రాబల్యం పెరుగుతోంది. ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న బెంగళూరు ఆహార పరిశ్రమలో ఈ పూటకూళ్ల పరిశ్రమలు రేపు ప్రముఖ పాత్ర వహించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటోలాంటి ఆహార సరఫరా సంస్థలకు ఈ పూటకూళ్లమ్మలను చూసి భయం పట్టుకుందట. ఈ ఆహార సరఫరా సంస్థల బిజినెస్ దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్లకు చేరుకోగా, అందులో 32 శాతం వాటా ఒక్క బెంగళూరు నుంచే వస్తోందట. ఇప్పుడు దానికి చిల్లు పడుతుందన్నది వారి చింత. ఫుడ్‌కు పేరుపోందిన కోరమంగళ ప్రాంతంలోనే దాదాపు 500 రెస్టారెంట్లు ఉన్నాయని, అవి ఉన్నంత వరకు తమకు ఢోకాలేకపోవచ్చని కూడా వారు భావిస్తున్నారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఓ పూటకూలమ్మ పుట్టుకొస్తే ఆహార పరిశ్రమలో గుత్తాధిపత్యం మాత్రం తగ్గుతుంది. అపార్ట్మెంట్ వాసుల అభిరుచులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ‘ఇంటి వంట’కు కూడా మరింత వన్నె తేవచ్చు. కాకపోతే ఇలాంటి వాటికి ఆర్డర్ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక వంటకాల కోసం ఓ రోజు ముందుగా కూడా ఇవ్వాల్సి రావచ్చు. -
భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చిన టాప్ హీరో
బెంగళూరు : మహిళా దినోత్సవం సందర్భంగా కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన భార్యకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఇప్పటికే పలు ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మరో ఖరీదైన కారు కొనుగోలు చేశారు. భార్య అశ్విని కోరిక మేరకు రూ.5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారును పునీత్ కొనుగోలు చేసి భార్యకు కానుకగా ఇచ్చారు. ఇంతకు ముందు కూడా భార్యకు ఖరీదైన జాగ్వార్ కారును బహుకరించారు పునీత్. ఇప్పుడు అత్యంత ఖరీదైన ల్యాంగోర్గిని కారు కలిగిన దర్శన్, నిఖిల్ కుమారస్వామి నటుల సరసన పునీత్ రాజ్‌కుమార్ కూడా చేరారు. -
మరదలిపై బావ అత్యాచారం
వివాహం చేసుకుంటానని నమ్మించి సొంత మరదలిపై అత్యాచారం చేసిన వ్యక్తి కోసం కోసం ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులు గాలిస్తున్నారు. వయ్యాలికావెల్‌లో నివాసం ఉంటు పండ్ల వ్యాపారి సురేష్ కోసం గాలిస్తున్నామని శనివారం పోలీసులు అన్నారు. వయ్యాలికావెల్‌లో నివాసం ఉంటున్న సురేష్ మరదలు ఇక్కడికి సమీపంలోనే నివాసం ఉంటోంది. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకుని వివాహం చేసుకుంటానని నమ్మించి కొన్ని నెలలుగా మభ్య పెడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోనని చెప్పడపంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెకు సురేష్‌తో వివాహం జరిపించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.