
మరదలిపై బావ అత్యాచారం
వివాహం చేసుకుంటానని నమ్మించి సొంత మరదలిపై అత్యాచారం చేసిన వ్యక్తి కోసం కోసం ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులు గాలిస్తున్నారు. వయ్యాలికావెల్‌లో నివాసం ఉంటు పండ్ల వ్యాపారి సురేష్ కోసం గాలిస్తున్నామని శనివారం పోలీసులు అన్నారు. వయ్యాలికావెల్‌లో నివాసం ఉంటున్న సురేష్ మరదలు ఇక్కడికి సమీపంలోనే నివాసం ఉంటోంది.
మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకుని వివాహం చేసుకుంటానని నమ్మించి కొన్ని నెలలుగా మభ్య పెడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోనని చెప్పడపంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెకు సురేష్‌తో వివాహం జరిపించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.