ఓయూలో నిరి్మంచిన సెంటినరీ పైలాన్ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 2017లో జరిగిన ఓయూ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల గుర్తింపుగా పైలాన్‌ను నిరి్మంచాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో పైలాన్ నిర్మాణంలో జాప్యం జరిగింది. మీడియా కథనాలతో వీసీ ప్రొ.రవీందర్ గతేడాది పైలాన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఓయూ చరిత్రలో నిలిచిపోయేలా రూ.1.58 కోట్లతో నిర్మించిన పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులను విద్యార్థి నేతల కోరగా సీఎంను కలిసేందుకు అనుమతి కోసం ప్రత్నిస్తున్నారు. నిరంతర కార్యక్రమాలతో సీఎం రేవంత్‌రెడ్డి బిజిబిజిగా ఉండటంతో ఓయూ అధికారులు కలవలేకపోతున్నారు. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పైలాన్ ప్రారంభం మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని త్వరితగతిన ప్రారంభించాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు.
–ఉస్మానియా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment