
ముందు సంపన్నుల ఇళ్లు కూల్చండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ముందుగా సంపన్నులు కబ్జా చేసుకున్న వాటిని కూల్చాలన్నారు. ఆ తర్వాతే పేదల జోలికి వెళ్లాలని సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చాలని 2015లోనే కోర్టు ఆదేశిస్తే.. ఇప్పుడు కూల్చడమేమిటన్నారు. ప్రభుత్వ పట్టాలిచ్చిన వారి ఇళ్లు కూల్చాలంటే పరిహారమివ్వాలన్నారు.