‘కేసీఆర్‌ను ఏ పార్టీలు విశ్వసించవు’ | BJP Leader Krishna Sagar Rao Said This Is The Last Chance For KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ను ఏ పార్టీలు విశ్వసించవు’

Dec 13 2018 1:20 PM | Updated on Mar 29 2019 9:07 PM

BJP Leader Krishna Sagar Rao Said This Is The Last Chance For KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కేసీఆర్‌కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం.. టీఆర్‌ఎస్‌కు ఇదే చివరి ప్రభుత్వం’ అంటూ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్‌ రావ్‌ విమర్శలు గుప్పించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ వ్యాఖ్యలు, నిర్వాకం చూస్తే ఆయ ఏ మాత్రం మారలేదనే విషయం అర్థమవుతోందన్నారు. తాడు, బొంగరం లేని కేసీఆర్‌ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఏ పార్టీలు విశ్వసించవన్నారు.

మజ్లీస్‌ను పట్టుకుని ఊరుగేదామని కేసీఆర్‌ కలలు కంటున్నారని ఆరోపించారు. మజ్లీస్‌ని జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్‌ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క పెండింగ్‌ ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయని కేసీఆర్‌ నీళ్లను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పడం విడ్డూరమని విమర్శించారు. దేశానికి ఒక సుప్రీం కోర్టు కాకపోతే.. రాష్ట్రానికి ఒకటి ఉంటుందా అని ప్రశ్నించారు. 2019లో రెండు జాతీయ కూటముల మధ్యే యుద్ధం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు 2019కి ఎలాంటి గీటురాయి కావని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement