సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మూడో రోజైన బుధవారం సైతం జీహెచ్‌ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పీడు మరింత పెంచారు. బుధవారం ఒక్కరోజే 211 నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తంగా కూల్చివేతలు 452కు చేరాయి. పేదలపై ప్రతాపం చూపవద్దని, భారీ అక్రమాలపైనే శ్రద్ధ పెట్టాలని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలందడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.
బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూల్చివేతలకు పూనుకున్నారు. రాయదుర్గంలోని మల్క చెరువు నాలాను ఆక్రమించిన భారీ నిర్మాణాలు, వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలోని హోటల్ కిచెన్‌హాల్ కూల్చివేతల్ని మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. మల్క చెరువు బఫర్‌జోన్‌లోని వే బ్రిడ్జి, స్క్రాప్ గోడౌన్‌లను కూల్చివేశారు. మూడోరోజు కూల్చివేతల్లో ముఖ్యంగా చెరువులపై వెలసిన వాణిజ్య నిర్మాణాలు, కూల్చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలున్న భవనాలు, నష్టపరిహారం చెల్లించిన నాలాల వెంబడి నిర్మాణాలు, బీఆర్‌ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ వహించారు.
అక్రమాలను సహించం..
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, నగరంలో అక్రమ నిర్మాణాలను సహించేదిలేదని స్పష్టం చేశారు.
కొనసాగుతున్న కూల్చివేతలు
Published Thu, Sep 29 2016 2:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement
Advertisement