canels
-
మూడో రోజు సాగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
కొనసాగుతున్న కూల్చివేతలు
-
కొనసాగుతున్న కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మూడో రోజైన బుధవారం సైతం జీహెచ్ఎంసీ అధికారులు నాలాలపై ఆక్రమణలు, వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల స్పీడు మరింత పెంచారు. బుధవారం ఒక్కరోజే 211 నిర్మాణాలు కూల్చివేశారు. మొత్తంగా కూల్చివేతలు 452కు చేరాయి. పేదలపై ప్రతాపం చూపవద్దని, భారీ అక్రమాలపైనే శ్రద్ధ పెట్టాలని మునిసిపల్ మంత్రి నుంచి ఆదేశాలందడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూల్చివేతలకు పూనుకున్నారు. రాయదుర్గంలోని మల్క చెరువు నాలాను ఆక్రమించిన భారీ నిర్మాణాలు, వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలోని హోటల్ కిచెన్‌హాల్ కూల్చివేతల్ని మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. మల్క చెరువు బఫర్‌జోన్‌లోని వే బ్రిడ్జి, స్క్రాప్ గోడౌన్లను కూల్చివేశారు. మూడోరోజు కూల్చివేతల్లో ముఖ్యంగా చెరువులపై వెలసిన వాణిజ్య నిర్మాణాలు, కూల్చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలున్న భవనాలు, నష్టపరిహారం చెల్లించిన నాలాల వెంబడి నిర్మాణాలు, బీఆర్ఎస్ గడువు ముగిశాక వెలసిన అక్రమ నిర్మాణాలు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై అధికారులు శ్రద్ధ వహించారు. అక్రమాలను సహించం.. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, నగరంలో అక్రమ నిర్మాణాలను సహించేదిలేదని స్పష్టం చేశారు. -
పోలవరంపై కాంట్రాక్టర్ కొత్త కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా కాల్వపై చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి అదనపు నిధుల కోసం కాంట్రాక్టర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ముందు అంచనా వేసిన సంఖ్య కంటే ఎక్కువ బ్రిడ్జిలను నిర్మించాల్సి వస్తుందని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు నిర్మాణ పనుల్ని చేయబోమని కాంట్రాక్టర్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఎడమ, కుడి ప్రధాన కాల్వలను నిర్మిస్తున్నారు. సుమారు 355 కిలో మీటర్ల పొడవు ఉండే ఈ కాల్వల నిర్మాణాల కోసం రూ. 3,356 కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్టు సంస్థతో ఒప్పందాలు జరిగాయి. ఈ నిర్మాణంలో భాగంగా కాల్వల తవ్వకంతో పాటు, వాటికి ఇరువైపులా లైనింగ్‌ను, అవసరాన్ని బట్టి బ్రిడ్జిలు, రోడ్లను కూడా చేపట్టాల్సి ఉంటుంది. ముందు అనుకున్న ప్రకారం ఈ కాల్వలపై సుమారు 140 రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే స్థానిక ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల దృష్ట్యా వీటి సంఖ్య రెట్టింపు అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ మేరకు నిర్మాణ వ్యయం కూడా పెరగనుంది. ఈపీసీ పద్ధతిన నిర్మాణ ఒప్పందాలు జరిగినందున.. బ్రిడ్జిలను ఎక్కువ సంఖ్యలో చేపట్టాల్సి వచ్చినా.. వాటికయ్యే వ్యయాన్ని కూడా సదరు కాంట్రాక్టర్లే భరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ అదనపు వ్యయం నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ బ్రిడ్జిలు, రోడ్లను కాంట్రాక్టర్లు నిర్మించడం లేదు. ఈ నిర్మాణాలను చేపట్టాలంటే.. అదనపు నిధులను చెల్లించాలని కాంట్రాక్టర్లు పట్టు పడుతున్నారు. కొంత కాలం నుంచి ఇదే విషయాన్ని అడుగుతున్న కాంట్రాక్టర్లు తాజాగా తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచారు. -
‘వరద కాలువ’ పూర్తయ్యేదెన్నడో?
సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట కోమటిచెరువు నుంచి నర్సాపూర్ ఊర చెరువు వరకు వరద కాలువ నిర్మాణం ఓ పట్టాన పూర్తవడంలేదు. శాశ్వత ప్రాతిపదికన తలపెట్టిన కట్టడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడంలో ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. పనుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించడం సిద్దిపేట డివిజన్ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ(ఐఅండ్‌సీఏడీ)కు సవాల్‌గా మారింది. సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్.. పట్టణంలోనే విస్తారమైన ఉనికిగలది. కొత్త బస్టాండ్-కోమటిచెరువు మధ్యలోని నిర్దేశిత ఏరియా.. దశాబ్దం కిందట వర్షాలూ.. వరదలతో ముంపునకు గురైంది. భవిష్యత్తులో అలాంటి దుస్థితి ఉత్పన్నం కావొద్దన్న ఉద్దేశంతో వరద కాలువ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని 2007లో నిర్ణయించారు. వాన, వరద నీరు ఆవాసాల చెంతన నిలువకుండానూ చిన్ననీటి వనరులకు తోడ్పాటుగానూ ఉండాలని ఆలోచించారు. దానికి ఉభయతారకమే ఫ్లడ్ ఫ్లో కెనాల్(వరద కాలువ)గా నిశ్చయించారు. ఆ క్రమంలోనే ఐఅండ్‌సీఏడీ రూ.1.23 కోట్లను కేటాయిస్తూ 2007 ఆగస్టు 21న ఉత్తర్వుచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదిరింది. కాలువ మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో రెండు వైపుల్లోనూ సిమెంట్ కాంక్రీట్ గోడల్ని 600 మీటర్ల మేర(సున్నా నుంచి 30వ గొలుసు వరకు) కట్టించారు. రెండో విడత గోసగోస ఎంచుకున్న ప్రాజెక్టు తొలి దఫాతో పూర్తవలేదు. అందుకే రెండో దఫాలో మిగతాది (30 నుంచి 76వ గొలుసు దాకా) సంపూర్ణం చేయాలని నిర్ణయించారు. ఈసారి రెండింతలకు పైగానే అంచనా వ్యయంగా లెక్కలేశారు. ఆ ప్రకారం రూ.3.07 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. దానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు 2012 మార్చి 6న జీఓ ఇస్తూ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. అదే వరుసలో హైదరాబాద్‌కు చెందిన మరో కాంట్రాక్టు సంస్థ పనులను దక్కించుకొంది. కానీ..ఈసారి నిర్మాణానికి వివాదాలు ముసురుకున్నాయి. పరిహారం కోరుతూ కోర్టుకు... తమ జాగాల్లోంచి కాలువ నిర్మాణాలు చేపట్టరాదని, ఒక వేళ అనివార్యమైతే పరిహారం ఇప్పించాలంటూ పలువురు హైకోర్టుకెళ్లారు. అలా తొమ్మిది కేసులు దాఖలయ్యాయి. సుమారు 70 మంది వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఎక్కడైతే వివాదం లేదో అక్కడ యంత్రాలతో కాలువను తవ్విస్తూ సీసీ(సిమెంట్ కాంక్రీట్) గోడల్ని ఆ డిపార్టుమెంటు కట్టించింది. దీంతో అది కాస్తా ప్యాచ్ వర్కు మాదిరిగా అవతరించింది. అలా 40 శాతం వరకు లాక్కొచ్చారు. పని విలువను బట్టి దాదాపు రూ.1.20 కోట్లు కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. గత జూన్ నుంచి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివాదాలు సమసిన వెంటనే... మొన్నటిదాకా వర్షాల కారణంగానూ మరో వైపు కోర్టు కేసుల వల్లనూ వరద కాలువ పనులు ఆగాయి. ప్రస్తు తం నెలకొన్న వివాదాలు సమసిన వెంటనే నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తాం. ఈ పనుల కారణంగా ఎవరికీ పరిహారం ఇచ్చే వెసులుబాటు శాఖాపరంగా లేదు. -కేఎన్ ఆనంద్, ఈఈ, నీటి పారుదల శాఖ, సిద్దిపేట