జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన
ఓ గంట ముందుగా ఇంటికి వెళ్లనివ్వకపోవడంపై అసహనం
సాక్షి, హైదరాబాద్: పండగా.. పబ్బమూ అని లేకుండా కరోనా విపత్కర పరిస్థితులెదురైనా విధులు నిర్వర్తించి నగర ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పండగల పూటైనా కనీసం గంట ముందు వెళ్లనివ్వకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. నగరంలో ఒక్కరోజు పారిశుద్ధ్య పనులు జరగకున్నా, ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సెలవులివ్వడం లేదు. దీంతో పండగలకు సెలవులు పెట్టకుండానే కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ పండగలు చేసుకునే సమయంలో వీరికి కనీసం గంటో, రెండు గంటలో నిర్ణీత వ్యవధి కంటే ముందుగా ఇళ్లకు వెళ్లే సదుపాయం కల్పించాలని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పటి కమిషనర్ ఆమ్రపాలి మినహాయింపునిచ్చారు. రోజూ మాదిరిగా పనిలోకి వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు రెండు పర్యాయాలు ‘అటెండెన్స్’ బదులు ఒక్కసారి వేస్తే చాలు అని మినహాయింపు ఇచ్చారు.
అయితే.. వారు చేయాల్సిన పని మొత్తం పూర్తిచేసి త్వరితంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఎవరైనా వీఐపీల కార్యక్రమాలుంటే తప్ప పండగల సందర్భాల్లో ఒకసారి హాజరు చాలునని సర్క్యులర్ జారీ చేశారు. దసరా పండగ సందర్భంగా దాన్ని వర్తింపజేశారు. సంక్రాంతికి మాత్రం అధికారులు తమను పూర్తి సమయం వరకు ఉండాల్సిందేనని పట్టుబట్టారని, తమకు మాత్రం కుటుంబాలు ఉండవా.. ఊళ్లకు వెళ్లకున్నా కనీసం ఇంటికి త్వరగా వెళ్లి పనులు చేసుకోవద్దా? అని పలువురు మహిళా కారి్మకులు వాపోయారు. దీనిపై ఓ అధికారి వివరణనిస్తూ, అప్పట్లో మినహాయింపు ఇచ్చినప్పుడు కేవలం దసరాకు మాత్రమే ఇచ్చారని, ముఖ్యమైన పండగలకు అలాంటి మినహాయింపు ఉంటుందని తెలిపినప్పటికీ, ప్రతి పండగకు ముందస్తుగా విజ్ఞప్తి చేసుకోవాలని సూచించారన్నారు.
ప్రతి పెద్ద పండగకూ విజ్ఞప్తి చేసుకోవడమేమిటన్నారు. తాము ఎవరికి విజ్ఞప్తి చేసుకోగలమని, ప్రతిసారీ యూనియన్ నేతలను ఆశ్రయిస్తే, వారు విజ్ఞప్తి చేయాలా? అని పారిశుద్ధ్య కారి్మకులు ప్రశ్నింస్తున్నారు. ఎప్పుడైనా పనులు చేసేది తామేనని, అయినా చేయాల్సిన పని మొత్తం పూర్తి చేశాకే కదా ఇళ్లకు వెళ్లేది. పనిలేకున్నా పూర్తి సమయం వరకు ఉండాలనడం ఏం న్యాయం అంటున్నారు. ఇప్పటికైనా ఈ అంశంలో ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకొని, భవిష్యత్‌లోనైనా కనీసం పెద్ద పండగలకైనా ఈ వెసులుబాటు కల్పించాలలి కోరుతున్నారు. పారిశుద్ధ్య కారి్మకుల్లో దాదాపు 90 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు.
చెట్టు చెట్టుకో కథ
Comments
Please login to add a commentAdd a comment